Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
‘F3’లో ఆ హీరో పాత్ర మరింత హైలైట్: పాత పాయింట్‌తో కొత్తగా చూపిస్తాడట
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం అలా వచ్చిన చిత్రాల్లో ఎక్కువ శాతం సూపర్ హిట్ అవడమే. ఇదే జోనర్‌లో విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఇది హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌ను కూడా తీస్తున్నారు.
'F3' రూపొందుతోన్న ఈ సినిమాలో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ను ప్రధానంగా చూపించబోతున్నారు. ఒక కుటుంబంలో డబ్బు అనేది ఎలాంటి ఇబ్బందులను సృష్టించింది అనే దానిని ఫన్నీగా తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎంతో హైలైట్‌గా ఉండబోతుందట. ఫస్ట్ పార్ట్‌లో తనదైన కామెడీతో అలరించిన ఆయన.. ఇందులో పిసినారిగా కనిపించబోతున్నాట. ఇద్దరు హీరోలకు అప్పులిచ్చి.. వాళ్లను పీడించుకు తినే పాత్రను చేస్తున్నాడట. పాత లైన్ అయినప్పటికీ దీన్ని కొత్తగా డిజైన్ చేశాడట అనిల్.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'F3' షూటింగ్ కొద్ది రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కరోనా లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే దీన్ని పున: ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అంటే.. జూన్ చివరి వారంలో కానీ, జూలై మొదటి వారంలో కానీ ఇది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక, ఇందులో సునీల్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడట. వీళ్లతో పాటు సంగీత కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి 'F2'ను మించి పోయేలా దీన్ని తీస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.