For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజేంద్ర ప్రసాద్ స్పెషల్ డ్రామా జూనియర్స్.. అప్పట్లో బాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్ సైజంటూ సీక్రెట్లు బయటపెట్టేశారు!

  |

  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హాస్యనటులు ఉన్నా రాజేంద్రప్రసాద్ ది సెపరేట్ క్రేజ్ అనే చెప్పాలి. తెలుగు తెరపై తనదైన ముద్ర వేసుకున్న ఆయన అనేక సినిమాల్లో హీరోగా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా జీ తెలుగు డ్రామా జూనియర్స్ వాళ్ళు ఒక స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  నిమ్మకూరులో పుట్టి

  నిమ్మకూరులో పుట్టి


  కృష్ణ జిల్లా గుడివాడ దగ్గరలో ఎన్టీఆర్ స్వగ్రామం అయిన నిమ్మకూరులో మధ్య తరగతి జన్మించిన రాజేంద్ర ప్రసాద్ మొదటి నుంచి చురుకుగా ఉండేవారు. ఎన్టీఆర్ ఆశీసులతో నటనపై ఆసక్తి పెరగడంతో చదువు పూర్తయిన వెంటనే చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‏లో చేరి మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అలా స్నేహం సినిమాతో తెరంగేట్రం చేసిన రాజేంద్ర ప్రసాద్.. మూడు మూళ్ళ బంధం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

  అలా హీరోగా మారి

  అలా హీరోగా మారి

  అలా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ప్రేమించు పెళ్ళాడు సినిమాతో హీరోగా మారాడు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత ఆయనకు కథానాయకుడిగా వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. అయితే హీరోగా అవకాశాలు వస్తే అవి చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. పీవీ నరసింహారావు లాంటి నటులే తమకు కాలక్షేపం కోసం ఆయన సినిమాలే చూసేవారమని చేబ్య్తూ ఉంటారు. అలాంటి ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేయబోతోంది జీ తెలుగు.

  బిజినెస్ లో దిగిన మరో తెలుగు హీరోయిన్.. చీఫ్ గెస్ట్లు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు

  అనుబంధాన్ని పంచుతూ

  అనుబంధాన్ని పంచుతూ

  జీ తెలుగు ఛానల్ లో డ్రామా జూనియర్స్ అనే షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఎస్.వి.కృష్ణారెడ్డి, అలీ, సింగర్ సునీత జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన సినిమాల స్కిట్లు ప్రదర్శించారు. రాజేంద్ర ప్రసాద్ తో పాటుగా ఆయన మనవరాలు నిశ్శంకర సావిత్రి కూడా ఈ షోకి హాజరయ్యారు.. చిన్నారులు ఒక్కో స్కిట్ వేస్తూ ఉండగా రాజేంద్రప్రసాద్ ఆయా సందర్భాలలో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు

  Recommended Video

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  విగ్గు ఊడిపోయి

  విగ్గు ఊడిపోయి


  ఇక ఒక స్కిట్ లో పెళ్లి చూపుల తతంగం చూపిస్తూ ఉన్న సమయంలో ఒక పిల్లవాడు లేడీ గెటప్ లో వచ్చి స్కిట్ లో పెర్ఫార్మన్స్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో విగ్ జారిపోతుంది. ఆ విగ్ జారి పోవడాన్ని చూసిన రాజేంద్ర ప్రసాద్ తాను మేడం సినిమా చేసేటప్పుడు జరిగిన కొన్ని అనుభవాలను పంచుకున్నారు.. ఆ సినిమా షూటింగ్ సమయంలో కబడ్డీ సీన్ చేస్తున్నప్పుడు సుమారు 20 సార్లు ఆ విగ్గు ఊడిపోయి పడింది అని చెప్పుకొచ్చారు.


  సుశాంత్ సిస్టర్స్ : 'ఆత్మహత్య' కాదంటూ ఒకరు, మన గర్వకారణం అంటూ మరొకరు!

  25వ తేదీన

  ఇక మేడమ్ కి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండేవారని శ్రీనివాస్, ప్రసాద్ అనే ఇద్దరూ షూటింగ్ మొదలయ్యే సమయానికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆనందపడే వారిని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగక మంచి సైజులో కరెక్ట్ గా ఉన్నారు అంటూ కామెంట్లు చేసే వారని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ ఈనెల 25వ తేదీన ఆదివారం నాడు టెలికాస్ట్ కాబోతోంది. మొత్తం మీద ప్రోమో మాత్రం ఆసక్తికరంగా ఉంది.

  English summary
  Rajendra Prasad is a popular Actor and Director. Latest movies in which Rajendra Prasad has acted are Check Mate, Gully Rowdy, Climax, Gaali Sampath. on the eve of his birthday attended in zee telugu's Drama Juniors shoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X