For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rishab Shetty: కాంతార హీరోకు కాస్ట్ లీ గిఫ్ట్స్ ఇచ్చిన రజనీకాంత్.. అవేంటో తెలుసా?

  |

  రిషబ్ శెట్టి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. కాంతార సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమా మొదటగా కన్నడ నాట విడుదలై వారం రోజుల్లోనే దేశం మొత్తం చర్చించుకునేలా చేసింది ఈ మూవీ. ముఖ్యంగా ఈ సినిమా టేకింగ్, డైరెక్షన్, యాక్షన్, మ్యూజిక్, కథ ఇలా ఒక్కటేంటి.. ప్రతి అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకునేందుకు ప్రధాన కారణం రిషబ్ శెట్టినే. దీంతో రిషబ్ శెట్టిపై ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం రిషబ్ షెట్టిని ఇంటికి పిలిచి మరి ఖరీదైన బహుమతులు ఇచ్చారు.

  ఎక్కువగా ఈ తరహా చిత్రాలు..

  ఎక్కువగా ఈ తరహా చిత్రాలు..

  గతంలో కంటే ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీ నుంచి ప్రయోగాత్మక కథలతో సినిమాలు వస్తున్నాయి. వీటికి అన్ని వర్గాల సినీ ప్రియుల నుంచి అదిరిపోయే స్పందన కూడా దక్కుతోంది. ఫలితంగా ఈ తరహా చిత్రాలు ఎక్కువ సంఖ్యలో తెరకెక్కుతోన్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమానే 'కాంతార'. కన్నడంలో రూపొందిన ఈ మూవీ.. ఆ తర్వాత అన్ని భాషల్లోకి వచ్చింది.

  రూ. 16 కోట్ల బడ్జెట్ తో..

  రూ. 16 కోట్ల బడ్జెట్ తో..

  ప్రముఖ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి చేసిన సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం సమకూర్చారు. కన్నడంలో సక్సెస్ అవడంతో దీన్ని ఆ తర్వాత తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన విషయం తెలిసిందే.

  చిన్న సినిమాగా మొదలై..

  చిన్న సినిమాగా మొదలై..

  చిన్న సినిమాగా మొదలైన కాంతార ప్రయాణం ఎల్లలు దాటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 187.40 కోట్ల షేర్ రాబట్టగా రూ. 369.70 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇప్పటికీ రూ. 50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో కాంతార హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది.

  టాప్ సెలబ్రిటీల ప్రశంసలు..

  టాప్ సెలబ్రిటీల ప్రశంసలు..

  రిషబ్ శెట్టిపై సినీ ఇండస్ట్రీ నుంచి అనేకమంది సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమాపై, రిషబ్ శెట్టిపై ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే ఇటీవల రిషబ్ శెట్టిని ఇంటికి ఆహ్వానించి సత్కరించారు సూపర్ స్టార్ రజనీకాంత్.

  మాస్టర్ పీస్ అంటూ రజనీ ప్రశంసలు..

  మాస్టర్ పీస్ అంటూ రజనీ ప్రశంసలు..

  గతంలోనే కాంతార సినిమా చూసిన తలైవా మూవీపై, రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా మాస్టర్ పీస్ అని, 50 ఏళ్లకు ఓసారి ఇలాంటి సినిమాలు రావని, సినిమా తనకు గూస్ బంప్స్ తెప్పించిందని ట్వీట్ చేశారు. ఇటీవల తాజాగా చెన్నైలోని ఆయన నివాసానికి రిషబ్ శెట్టిని ఆహ్వానించారు రజనీకాంత్. తర్వాత రిషబ్ శెట్టిన సత్కరించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనకు గోల్డ్ చైన్, గోల్డ్ లాకెట్ లను బహుమతులుగా అందించారు.

  రజనీ-రిషబ్ కాంబోలో సినిమా?

  కాంతారా సినిమా చాలా బాగుందని, అద్భుతమైన సినిమా తీసావంటూ రిషబ్ శెట్టిని పొగిడారు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే వీరిద్దరి కలయికలో సినిమా ఉండనుందా అని టాక్ వినిపిస్తోంది. అందుకే రిషబ్ శెట్టిని రజనీ కాంత్ ఇంటికి ఆహ్వానించి ఉంటారని అనుకుంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్ ప్రాజెక్ట్ లపై వీరిద్దరూ కాసేపు చర్చించుకున్నారని భోగట్టా. అయితే వీటిపై ఎలాంటి స్పష్టత లేదు.

  English summary
  Superstar Rajinikanth Invited Kantara Hero And Director Rishab Shetty And Gives Expensive Gifts To Him
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X