రామ్ చరణ్ పుట్టినరోజు.. కొడుకుపై తండ్రి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవలే సోషల్ మీడియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా తన కొడుకు రామ్ చరణ్‌ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేడు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నోటివెంట వచ్చిన గోల్డెన్ వర్డ్స్ ఇవి. మరి కొడుకుపై చిరంజీవి ఏమని కామెంట్స్ చేశారు? ఎలా రియాక్ట్ అయ్యారు? ఓ లుక్కేద్దామా..

'చిరుత'లా వచ్చి తిరుగులేని స్టార్..
తెలుగు చిత్రసీమలో తండ్రీ కొడుకులిద్దరూ స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. నిన్నటితరం ప్రేక్షకలోకంలో చిరంజీవి అంటే క్రేజ్ ఎంతలా ఉండేదో.. నేటితరం ప్రేక్షకుల్లో రామ్ చరణ్ అంటే అంతే క్రేజ్ ఉందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. 'చిరుత'లా తెరపై కాలుమోపిన చెర్రీ.. ఆ తరువాత 'మగధీర'గా భారీ ఫాలోయింగ్ కూడగట్టి తిరుగులేని స్టార్ అయ్యారు.

పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేస్తున్న చిరు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగా ఫ్యామిలీ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు వెళ్తున్న రామ్ చరణ్‌ని చూసి తండ్రి చిరంజీవి ఉప్పొంగిపోయిన సందర్భాలు ఎన్నో. తనయుడి ప్రతిభ చూసి అందరూ అభినందిస్తుంటే ఆ పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్. ఈ మేరకు తాజాగా రామ్ చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చిరంజీవి.

మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్..
మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన ఆ సమయంలో తను ఈ భూమ్మీద లేనని.. అంతగా ఆనందపడ్డానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ రోజు మాటల్లో చెప్పలేనంతగా సంతోష పడ్డానని పేర్కొన్నారు. ఈ మేరకు చరణ్‌ని ఎత్తుకొని ఆడిస్తున్న ఫోటో షేర్ చేసి మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు చిరు.

యాక్టింగ్ విషయంలో రామ్ చరణ్..
రామ్ చరణ్ పుట్టినరోజైన ఈ రోజే (మార్చి 27) ప్రపంచ రంగస్థల దినోత్సవం కావడం కూడా విశేషం అని చెప్పారు చిరంజీవి. ఇక చరణ్ యాక్టింగ్ విషయంలో నీటిలో చేప లాంటి వాడని తెలుపుతూ కొనియాడారు. ఈ మేరకు ఆత్మీయంగా చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు చిరంజీవి.

హోరెత్తుతున్న సోషల్ మీడియా.. చెర్రీ బర్త్ డే విషెస్
మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా అటు సెలబ్రిటీలు, ఇటు మెగా అభిమాన లోకం ఆయనకు పెద్దఎత్తున బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాలు చెర్రీ పుట్టినరోజు శుభాకాంక్షలతో హోరెత్తిపోతున్నాయి.
Recommended Video
భారీ మూవీ RRR
ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా RRR తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న RRR నుంచి ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై ఉన్న హైప్ అమాంతం పెంచేసింది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ మూవీ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











