twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చనిపోయే వరకు తారక్ తో అలానే.. అతనికి థ్యాంక్స్ కూడా చెప్పను: రామ్ చరణ్

    |

    రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొట్ట మొదటి మల్టీస్టారర్ మూవీ RRR సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి. ఇక చిత్ర యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రమోషన్ కూడా సినిమా పై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే ఇటీవల రామ్ చరణ్ మాట్లాడిన విధానం ఎన్టీఆర్ అభిమానులను అలాగే తెలుగు ప్రేక్షకుల హార్ట్ ని టచ్ చేశాయి అనే చెప్పాలి.

    Recommended Video

    RRR : JR NTR VS Ram Charan Fan Wars | Akhanda Collections || Filmibeat Telugu
    క్లోజ్ ఫ్రెండ్స్..

    క్లోజ్ ఫ్రెండ్స్..

    జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా RRR సినిమా కంటే ముందే చాలా మంచి స్నేహితులు. ఎక్కువగా బయట ఆ విషయాన్ని చెప్పుకునే వారు కాదు. ఇక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు హీరోలు వారి స్నేహం గురించి చాలా విషయాలను చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తనకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అని తమ స్నేహం గురించి ఎక్కువగా బయటకు చెప్పుకునే రకం కాదని కూడా చెబుతున్నాడు.

    ఎన్టీఆర్ సోదరులకు..

    ఎన్టీఆర్ సోదరులకు..

    ఇక రీసెంట్ గా తమిళ ఇండస్ట్రీలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే అక్కడికి కూడా నందమూరి మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే రామ్ చరణ్ మాత్రం ముందుగా తన స్పీచ్ మొదలు పెట్టేటప్పుడు ఎన్టీఆర్ సోదరులకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని మొదటి మాట తోనే అందరినీ టచ్ చేశాడు.

    చిన్న పిల్లడిలా..

    చిన్న పిల్లడిలా..

    జూనియర్ ఎన్టీఆర్ వయసు లో తనకు ఏడాది గ్యాప్ ఉన్నప్పటికీ నాకు సొంత బ్రదర్ తో సమానం అని తెలియజేశారు. అంతేకాకుండా అతను చిన్న పిల్లాడి మనస్తత్వం, ఈ పర్సనాలిటీ లో మాత్రం సింహం అని చెప్పాడు. ఒక రకంగా అతనితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని కూడా ఇండైరెక్ట్ గా తారక్ మంచితనం గురించి తెలియజేశాడు.

    చనిపోయే వరకు..

    చనిపోయే వరకు..

    జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం చనిపోయేవరకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అతనికి నేను థాంక్స్ కూడా చెప్పను. ఎందుకంటే తనని దూరం చేసినట్లే అవుతుంది. ఒక విధంగా దేవుడికి మాత్రం థాంక్స్ చెబుతాను. ఎందుకంటే ఇంత మంచి స్నేహితుడిని నాకు ఇచ్చాడు. ఈ స్నేహం ఈ బంధం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను... అని రామ్ చరణ్ ఎమోషనల్గా ఎన్టీఆర్ గురించి వివరణ ఇచ్చాడు

    మొదటి ఇండస్ట్రీ హిట్..

    మొదటి ఇండస్ట్రీ హిట్..

    ఇక రాజమౌళి కూడా తన జీవితంలో అత్యంత ఆప్త మిత్రుడు అని తన సినిమా జీవితంలో మొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు ఆయన అని తెలియజేశారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అంటూ నిర్మాత డి.వి.వి.దానయ్య కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఇక సినిమాలో పని చేసి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారని వారందరికీ కూడా సినిమా ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని చరణ్ వివరణ ఇచ్చారు.

    English summary
    ram charan emotional comments on jr ntr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X