RGV: వర్మకు తీరని విషాదం.. తల్లిని కాపాడుకోబోయి.. సోదరుడు మృతి..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి రోజుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక వైరస్ బారిన పడి సినీ ప్రముఖులు కూడా మరణిస్తున్నారు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ కుటుంబంలో కూడా ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. RGV సపోర్ట్ తోనే ఆయన కూడా ప్రొడక్షన్ పరంగా పలు సినిమాలకు వర్క్ చేశారు. ఇక తల్లిని రక్షించే క్రమంలో అతను ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది.
Recommended Video

రామ్ గోపాల్ వర్మ కుటుంబంలో విషాదం
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కరోనా వైరస్ రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతోంది. ఫస్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి అనేక మంది సినీ ప్రముఖుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కుటుంబంలో కూడా ఒక సినీ ప్రముఖుడు ప్రాణాలు విడువడం అందరిని షాక్ కు గురి చేసింది.

ఆ సినిమాలతో గుర్తింపు..
సోమశేకర్ రామ్ గోపాల్ వర్మకు అత్యంత దగ్గరి బంధువు. వరుసకు సోదరుడు అవుతారు. రంగీలా, దౌడ్, సత్య, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. హిందీలో ముస్కురాకే దేఖ్ జరా అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సోమశేఖర్ వ్యాపారాలతో బిజీ అయ్యారు. చాలా కాలంగా వర్మకు దూరంగానే ఉంటున్నారు.

అతి తక్కువ సమయంలోనే
నిర్మాత , దర్శకుడిగా మంచి అనుభవం ఉన్న P సోమశేకర్ కరోనా వైరస్ కారణంగా తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొదట్లో అంతా బాగానే ఉందని చిన్నప్పటి జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆ మహమ్మారి అతి తక్కువ సమయంలోనే ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది.

తల్లిని కాపాడుకోబోయి
అయితే ఆయన కంటే ముందే తల్లికి కరోనా వైరస్ రావడంతో ఆమెకు సేవలందించారు. తల్లి మీద ప్రేమతో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో తన ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేదు. ఈ విషయాన్ని బాలీవుడ్ నిర్మాత బోణికపూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తల్లిని కాపాడుకోబోయి సోమశేకర్ ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచి వేసిందంక్ బోణి కపూర్ ట్వీట్ చేశారు.

అస్సలు ఊహించలేదు..
వీరిద్దరు సినిమాల పరంగానే కాకుండా రియల్ లైఫ్ లో మంచి స్నేహితులు. ఇక అతని మరణంతో బోణి కపూర్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని అతనితో ఎన్నోసార్లు వర్క్ చేసిన అనుభవాలు ఇంకా మరచిపోలేదని అన్నారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











