తాగి ట్వీట్లు వేశావా? ఫాల్కేపై రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లు.. నెటిజన్ల ఫైర్
ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు దేశంలోనే అత్యున్నత సినీ పురస్కారం లభించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలు, భారతీయ సినిమా పరిశ్రమ ఖ్యాతి కోసం ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు. మోహన్‌లాల్‌కు ఈ అవార్డు దక్కడంపై సినీ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో స్పందించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వర్మ చేసిన ట్వీట్లు ఏమిటి? నెటిజన్లు ఎలా స్పందించారనే వివరాల్లోకి వెళితే..
దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. మరొకొన్ని వివాదాస్పదంగా మారుతుంటాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురించి చేసిన కామెంట్స్ అత్యంత వివాదంగా మారాయి. అలాగే చంద్రబాబు, లోకేష్ గురించి చేసిన కామెంట్స్, ట్వీట్స్ ఆయన కేసుల్లో ఇరుక్కొనేలా చేశాయి. తాజాగా ఫాల్కేపై మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆ వివరాల్లోకి వెళితే..

దాదా సాహెబ్ ఫాల్కే గురించి నాకు ఎక్కువగా తెలియదు. ఆయన ఇండియాలో తొలి సినిమాను తీశాడనే విషయం మాత్రమే నాకు తెలుసు. అయితే ఆ సినిమాను చూసిన వాళ్లను కూడా నేను ఎప్పుడూ కలువలేదు. కానీ నాకు మోహన్‌లాల్ తెలుసు. ఆయనను కూడా చూశాను. కాబట్టి దాదా సాహెబ్ ఫాల్కేకు మోహన్ లాల్ అవార్డు ఇస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
ఫాల్కేను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేస్తూ.. పోయినోళ్లందరూ గ్రేట్ కాదు. ప్రస్తుతం బతికి ఉన్న వాళ్లలో గొప్ప వాళ్లు ఉన్నారు. వాళ్లు పోయినోళ్లందరి కంటే.. చాలా గ్రేటర్. పోవడం అదనపు క్వాలిఫికేషన్ కాదు. అది అచీవ్‌మెంట్ కూడా కాదు. పోయినోళ్ల పేరు మీద బతికి ఉన్న గొప్పవాళ్లకు అలాంటి అవార్డులు ఇవ్వడం చాలా తప్పుపని. బతికి ఉన్న వాళ్లు, మరణించిన వాళ్లను మధ్య చూపిస్తున్న వివక్ష అదే అని ఆర్జీవి మరో ట్వీట్ చేశాడు.
వర్మ చేసిన వరుస ట్వీట్లలో మరోటి ఏమిటంటే.. జీవించి ఉన్నవాళ్లు.. చనిపోయిన వాళ్లు గొప్పవాళ్లు అని చెప్పడానికి నిజమైన ప్రజాస్వామ్యం ఏమిటంటే? గురుదత్‌కు ప్రశాంత్ నీల్ అవార్డు ఇవ్వాలి. సందీప్ రెడ్డి వంగాకు రాజ్ కపూర్ అవార్డు ఇవ్వాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకొంటుంది అని వర్మ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్స్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఎన్నో పెగ్ వేసి ట్వీట్ చేశావు మామా.. అని కామెంట్ చేశాడు. నీకు మాత్రం దాదా కోండ్కే అవార్డు ఇవ్వాలి అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
నీకు దాదా సాహెబ్ ఫాల్కే అంటే ఎవరో తెలియదు. నీవు అయనను చూడలేదు. ఎప్పుడు కలువలేదు. ఆయన గురించి నీకు జీరో నాలెడ్జ్ ఉంది. అయితే మోహన్ లాల్ అవార్డు అంటున్నావు కదా.. ఫాల్కే సాబ్ ఇండియాలో తొలి సినిమాను నిర్మించాడు. మోహన్‌లాల్ అలాంటి సినిమాలో పనిచేస్తున్నాడు. మీరు కాస్త తక్కువ తాగండి.. మీరు ఎంత తాగాలంటే.. హద్దు మీరనంత వరకు తాగండి అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు. ఇంకా ఆర్జీవి అవార్డు ఇవ్వాలని చెప్పలేదు.. సంతోషం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే మరో నెటిజన్ కాస్త ముందుకు వెళ్లి.. ఆర్జీవి మానసిక ఆరోగ్యం బాగానే ఉందా? కాస్త చెప్పు అంటూ గ్రోక్‌ను అడిగడం కొసమెరుపుగా మారింది.


Click it and Unblock the Notifications











