twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేపు కృష్ణంరాజుకు పట్టిన గతే మీకు.. ఉమ్మేసుకొన్నట్టే.. బాలయ్య, చిరు, పవన్, మహేష్‌‌పై ఆర్జీవి ఘాటైన ట్వీట్!

    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముక్కుసూటిగా మాట్లాడటంలో ఎలాంటి మొహమాటమే ఉండదు. ఏదైనా తనకు నచ్చకపోతే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. ఎవరు ఏమనుకొన్నా సరే.. ట్వీట్లతో దాడి చేస్తుంటారు. అయితే కృష్ణంరాజు మరణం నేపథ్యంలో వర్మ చేసిన ట్వీట్లు సంచలనం రేపాయి. సినీ ప్రముఖులను ఆయన ట్వీట్లతో ప్రశ్నించిన తీరు దుమారం రేపుతున్నది. ఇంతకు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ఏమిటంటే?

     గొప్ప చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత

    గొప్ప చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత

    కృష్ణంరాజు తెలుగు సినిమా పరిశ్రమకు అద్బుతమైన సినిమాలు అందించారు. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత. ఆయన కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు! అని రాంగోపాల్ వర్మ తొలి ట్వీట్‌లో స్పందించారు.

    రేపు ఇదే దుస్థితి మీకు కూడా

    రేపు ఇదే దుస్థితి మీకు కూడా

    కృష్ణంరాజు మరణం నేపథ్యంలో షూటింగులు ఆపుకోకుండా సినీ పరిశ్రమ వ్యవహారాలను కొనసాగించడంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి గారికి , మోహన్ బాబు గారికి, బాలయ్యకి, ప్రభాస్‌కి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే. రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అని వర్మ రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు.

    మన చావుకి విలువ ఉండాలంటే..

    మన చావుకి విలువ ఉండాలంటే..

    సినీ ప్రముఖులు, నిర్మాతలపై రాంగోపాల్ వర్మ సెటైర్లు వేస్తూ.. మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది అంటూ వర్మ మరో ట్వీట్‌లో ఘాటుగా స్పందించారు.

     కనీసం రెండు రోజులు షూటింగులు ఆపేద్దాం

    కనీసం రెండు రోజులు షూటింగులు ఆపేద్దాం

    తిరిగి రాని లోకాలకు వెళ్లిన కృష్ణంరాజు సేవల గుర్తుగా ఆయనను గౌరవిద్దాం అని వర్మ అన్నారు. మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం అని వర్మ మరో ట్వీటులో సూచించారు.

    కృష్ణంరాజు అంత్యక్రియలు

    కృష్ణంరాజు అంత్యక్రియలు

    రెబల్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన కృష్ణంరాజు అనారోగ్యంతో సెప్టెంబర్ 11వ తేదీన కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. పలువురు ప్రముఖులు కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ప్రభాస్‌ను ఓదార్చారు. సెప్టెంబర్ 12వ తేదీన ఆయన అంత్యక్రియలను మోయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తారు.

    English summary
    RGV questions Tollywood decision to continue shoots at time Krishnam Raju death. He said, Samething will happen to you in future. Why should not stop shoot for two days in respect of Krishnam Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X