ఇటలీలో రామ్.. ఆ హీరోయిన్‌తో అలా!!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'రెడ్'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొంతకాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విభిన్న తరహా కథనంతో రూపొందుతున్న ఈ సినిమా క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.
ఈ సినిమాలో రామ్ సరసన నివేద పేతురాజ్, మాళవిక శర్మ, అమృత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే టాకీ పార్టు పూర్తిచేసిన చిత్రయూనిట్.. ప్రస్తుతం పాటల చిత్రీకరణను పూర్తిచేసే పనిలో పడింది. ఈ మేరకు ఇటలీలో రెండు పాటలను ప్లాన్ చేశారు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో పాటలను చిత్రీకరిస్తున్నారు.

గతంలో రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్లో 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు వచ్చాయి. దీంతో హాట్రిక్ సినిమాగా ఈ 'రెడ్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది ఈ జోడీ. సినిమాను తన హోం బ్యానర్ స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందిస్తున్నాడు రామ్.
మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వెండితెరపై రామ్ చెడుగుడు మరోసారి చూడాలని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











