ఆనంద్ దేవరకొండ కోసం రష్మిక.. ఇది మామూలు ప్రమోషన్ కాదు!

విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలు, వారసత్వపు హీరోలకు ధీటుగా ఎదిగాడు. సోషల్ మీడియాలో ఈ రౌడీకి ఉన్న ఇమేజ్ వేరే లెవెల్. విజయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. ఏదైనా సమస్యపై విజయ్ స్పందించే తీరే ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి విజయ్ దేవరకొండ తన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే ఏ రేంజ్‌లో ప్రమోట్ చేస్తారో అందరూ అనుకుంటారు. కానీ విజయ్ మాత్రం తన తమ్ముడు సొంతంగా ఎదగాలి అని కోరుకుంటూ.. దొరసాని సినిమాను ప్రమోట్ చేయలేదు.

దొరసాని మంచి ప్రయత్నంగా మిగిలింది కానీ కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. అయితే రెండో ప్రయత్నంగా చేస్తోన్న మిడిల్ క్లాస్ మెలోడీస్‌ను మాత్రం విజయ్ తన భుజాన వేసుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా విజయ్ ఈ మూవీ గురించి చెబుతూ ఓ ట్వీట్ వేశాడు. సినిమా చూశానని, చాలా బాగుందని తెలిపాడు. సినిమా ప్రారంభించే ముందు కచ్చితంగా పాప్ కార్న్ చేతిలో పట్టుకుని కూర్చోండి.. గుంటూరు సాంగ్ మీలో ఆకలిని పెంచుతుందని తెలిపాడు.

Rashmika Mandanna Promotes anand Deverakonda middle class Melodies

తాజాగా రష్మిక మందాన్న మిడిల్ క్లాస్ మెలోడిస్ గురించి చెబుతూ.. నేను సూటిగా సుత్తి లేకుండా చెబుతాను.. జెన్యూన్ ఫిల్మ్.. క్యారెక్టర్స్, లొకేషన్స్, స్టోరీ, తెరకెక్కించిన విధానం, వారు పడిన కష్టం అన్ని కూడా కనిపిస్తాయి.. నేను చూశాను. ఎంతగానో ఎంటర్టైన్మెంట్ ఉంది.. కట్టిపడేసింది.. నా ఇద్దరు స్నేహితులు ఇలా సిల్వర్ స్క్రీన్‌పైకి వస్తారని అనుకోలేదు.. ఆ ఇద్దరిని అలా చూడటం ఎంతో సంతోషంగా ఉంది.. ఆనంద్, వర్ష బొల్లమ్మ ఎంతో బాగా నటించారు.. ఐ లవ్యూ యువర్ ఫిల్మ్.. మీ పాత్రలు నాకెంతో నచ్చాయి.. ప్రేక్షకులు చూశాక కూడా ఇదే చెబుతారు అంటూ రష్మిక చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X