అతను నా చైల్డ్‌హుడ్ క్రష్.. ఇప్పటికీ! టాప్ సీక్రెట్ బయటపెట్టిన రష్మిక మందన్న
కన్నడ భామ రష్మిక మందన్న తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. 'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కి 'గీతగోవిందం' సినిమాతో క్రేజ్ కొట్టేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. దీంతో తెలుగు చిత్రసీమలో క్రేజీ బ్యూటీగా మారింది రష్మిక. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాప్ సీక్రెట్ బయటపెట్టింది రష్మిక మందన్న.
రష్మిక మందన్న లేటెస్ట్ మూవీ భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ క్రేజీ బ్యూటీ.. తన అభిమాన హీరో గురించి చెప్పుకొచ్చింది.

చిన్నప్పటి నుంచి తాను తమిళ హీరో విజయ్‌కు వీరాభిమానినని తెలిపింది రష్మిక. విజయ్ తన చైల్డ్‌హుడ్ క్రష్ అని, ఇప్పటికీ ఆయనంటే చాలా ఇష్టమని పేర్కొంది. ఆయన సినిమాలో నటించే అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. రష్మిక చెప్పిన విషయాన్ని విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో విజయ్ జోడీగా రష్మిక నటించాలని వారు కోరుకుంటున్నారన్నమాట.
ఇకపోతే అల్లు అర్జున్ సరసన మరో సినిమాలోనూ నటిస్తోంది రష్మిక మందన్న. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రష్మిక క్యారెక్టర్ స్పెషల్‌గా ఉండనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











