విజయ్ vs రష్మిక: సంపాదనలో ఎవరు టాప్? ఎవరికి ఎన్ని కోట్లు?
Rashmika Mandanna vs Vijay Deverakonda: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ హీరో విజయ్ దేవర కొండ గత కొన్నాళ్లుగా డేటింగ్ వార్తలు నెట్టింట తెగ హల్ చల్ చేశారు. ముఖ్యంగా గీతా గోవిందంతో మొదలైన వీరి మధ్య ప్రేమ, డియర్ కామ్రెడ్ మూవీతో మరింత ఎక్కువైంది. వీరిద్దరు ఎక్కడ కనిపించిన రిలేషన్ ఉన్నారంటూ వార్తలు వచ్చేవి. ఇలాంటి సందర్భంలో ఎవరికి తెలియకుండా ఇటీవల ఎంగెజ్ మెంట్ చేసుకుని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ నెట్ వర్త్ ఎంత? రష్మిక నెట్ వర్త్ ఎంత? అనే విషయాన్నితెగ సెర్చ్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లూక్కేయండి. ఇంతకీ ఎవరి సంపదన ఎక్కువ? ఎన్నికోట్లు?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ హీరో విజయ్ దేవర కొండ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా బయటకు చెప్పలేదు. కానీ, ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని విజయ్ టీమ్ చెబుతున్నారు. ఈ అంచనా ప్రకారం.. రష్మిక పెళ్లి హడావుడిలో పడిపోతుంది. ఇదిలా ఉంటే.. రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది ఇండస్ట్రీ నుండి నార్త్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రష్మిక కెరియర్ లో పుష్ప సినిమా మైల్ స్టోన్ మూవీ గా చెప్పవచ్చు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. రష్మిక నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత 'యానిమల్'మూవీతో బాలీవుడ్ లో జెండా పాతేసింది. ఆ తర్వాత 'పుష్ప 2' విజయంతో మరోసారి స్టామినా ఏంటో ఇండస్ట్రీకి చెప్పింది. ఆ తర్వాత చావా మూవీ తో మరోసారి తన సత్తా ఏంటో చాటింది.

రష్మిక మందన్న నెట్ వర్త్
ఇలా వరుస విజయాలను అందుకుంటున్న రష్మిక మందన్న దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరుగా నిలిచారు. మీడియా కథనాల ప్రకారం ఆమె ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే పుష్ప 2 కోసం ఏకంగా రూ.10 కోట్లు సొంతం చేసుకుందని టాక్. ఈ అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 47.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న్నారు.
రష్మిక మందన్న కేవలం యాక్టింగ్ తో పాటు వివిధ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు, మోడలింగ్ అసైన్‌మెంట్‌లు, బ్రాండ్ అంబాసిడర్ పాత్రల ద్వారా కోట్ల రూపాయాలను సంపాదిస్తోంది. ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం రష్మిక నెట్ వర్త్ దాదాపు రూ. 66 కోట్లకు పైనే ఉంటుందట. అలాగే.. రష్మిక ఈ ఏడాది ఆగస్టులో స్వరోవ్స్కీ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైంది. ఫిట్‌నెస్ బ్రాండ్ ఐసోప్యూర్ మొదటి ఇండియన్ అంబాసిడర్ రష్మిక నిలిచింది.
అంతేకాకుండా రష్మిక మందన్న గతంలో బోట్, కళ్యాణ్ జ్యువెల్లర్స్, 7అప్, మీషో, వేగన్ బ్యూటీ వంటి పలు బ్రాండ్‌లకు ప్రచారం చేసింది. 'నేషనల్ క్రష్'గా పేరుగాంచిన రష్మిక మందన్నకు బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా ఉంది. అంతేకాకుండా.. ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్‌లో కూడా ఆమె పేరిట ఆస్తులున్నాయట. రష్మిక మందన్న 4 సార్లు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును అందుకుంది. అలాగే.. సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకుంది. దీనితో పాటు ఇండియా 2024 '30 అండర్ 30' జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు రష్మిక.
విజయ్ దేవరకొండ నెట్ వర్త్:
మరోవైపు టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ నెట్ వర్త్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జీక్యూ ఇండియా ప్రకారం - 2024 ప్రారంభంలో విజయ్ నెట్ వర్త్ సుమారు రూ. 39 కోట్లుగా (సుమారు $4 మిలియన్లు) అంచనా వేయబడింది. ఆయన ప్రధాన ఆదాయ వనరులు సినిమాలు, ఫ్యాషన్ లేబుల్ రౌడీ క్లబ్, వాలీబాల్ జట్టు యాజమాన్యం, వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో విజయ్ దేవరకొండ నివసించే భవనం రూ. 15 కోట్ల విలువ కలిగి ఉంది.
అలాగే.. 2018లో విజయ్ తన ఓన్ ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించారు. 2020లో రౌడీ వేర్ మింట్రాలో కూడా భాగస్వామిగా చేరి, అథ్లీజర్ వేర్‌లలో గుర్తింపు పొందుతూ కొనసాగించారు. అదనంగా, విజయ్ లగ్జరీ కార్లలో ప్రియుడు. BMW 5 సిరీస్, ఫోర్డ్ మస్టాంగ్, వోల్వో XC90, రేంజ్ రోవర్ వంటి విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నారు. ఇటు సినిమాలు, అటు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ఫ్యాషన్ వ్యాపారాల ద్వారా విజయ్ దేవరకొండ బాగానే సంపాదిస్తున్నారు. తన స్టార్ పవర్, లగ్జరీ లైఫ్, ఫ్యాషన్ సెన్స్ తో టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ స్టార్‌లలో ఒకరుగా నిలిచారు. ఈ లెక్కన చూస్తే.. విజయ్ కంటే రష్మిక సంపాదనలో టాప్ లో నిలిచారు.


Click it and Unblock the Notifications











