twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tollywood Drugs Case: ముగిసిన రవితేజ ఈడీ విచారణ.. చివరకు చెప్పింది ఏమిటంటే?

    |

    టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి రావడంతో కేసు సరికొత్త మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా గతంలో కంటే ఎక్కువ సమాచారం రాబట్టే ఛాన్స్ కూడా ఉందట. ఇక ప్రతిరోజూ ఒక్కొక్కరుగా సెలబ్రెటీలు ఈడీ విచారణకి హాజరవుతున్నారు.

    వారిని గంటల తరబడి విచారిస్తున్న ఆఫీసర్లు గతంలో జరిగిన బ్యాంక్ ఖాతా లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఇక గురువారం ఉదయమే ఈడీ కార్యాలయానికి వచ్చిన రవితేజ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆరు గంటల విచారణ అనంతరం కొద్దీ సేపటి క్రితమే ఆయన విచారణ కూడా ముగిసింది.

    ఈడీ రంగంలోకి రావడంతో

    ఈడీ రంగంలోకి రావడంతో

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆరోపణల కారణంగా గతంలోనే కొంతమంది టాలీవుడ్ ప్రముఖులను అధికారులు విచారించారు. ఈ వివాదానికి ఎప్పుడో ముగింపు కార్డ్ పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి రావడంతో కేసు మరొక యూ టర్న్ తీసుకుంది. ప్రతి ఒక్క సెలబ్రెటీని క్షుణ్ణంగా విచారించాలని అధికారులు ప్రత్యేకంగా గంటల తరబడి దశల వారిగా విచారణ జరుపుతున్నారు.

    కాస్త ముందుగానే..

    కాస్త ముందుగానే..

    ఇటీవల డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో పాటు రీసెంట్ సెలబ్రెటీస్ పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్‌ ప్రీత్ సింగ్, యాక్టర్ నందు, రానా దగ్గుబాటి, ముమైత్ ఖాన్ లను వరుసగా విచారించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొత్తం 12 మందికి ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఇక వారికి ఇచ్చిన తేదీల ప్రకారం రోజు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కాగా రకుల్ మాత్రం కాస్త ముందుగానే తన విచారణ ప్రక్రియను ముగించుకుంది.

    ఆరు గంటల పాటు రవితేజ విచారణ

    ఆరు గంటల పాటు రవితేజ విచారణ

    ఇక కొద్దీ సేపటి క్రితమే ఈడీ కార్యాలయంలో రవితేజ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రవితేజను విచారించింది. అలాగే అతని దగ్గర ఎంతో కాలంగా పని చేస్తున్న డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా అధికారులు. పలు లావాదేవీపై విచారించినట్లు తెలుస్తోంది. అలాగే మరొక కీలక సూత్రధారిగా ఉన్నటువంటి మహమ్మద్ జిషాన్ అలీ ఖాన్ అలియాస్ జాక్ సైతం ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. అతన్ని 2017లో కొకైన్ సరఫరా చేస్తుండగా ఎక్సైజ్ శాఖ కు దొరికాడు.

    ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పిన రవితేజ

    ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పిన రవితేజ

    ఇక నేడు హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో జిషాన్ తో పాటు రవితేజను అలాగే డ్రైవర్ శ్రీనివాస్ ను విచారించారి. ఎక్కువగా రవితేజ ఆర్ధిక లావాదేవీలపై కూపీ లాగేందుకు అధికారులు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. రవితేజ బ్యాంక్ వివరాలు, డ్రైవర్ శ్రీనివాస్ తో జరిపినఆర్ధిక లావాదేవీల పై కూడా ప్రశ్నించడం జరిగింది.

    ఇక ఎప్పుడు విచారణ కు పిలిచిన హాజరు కావాలని రవితేజ,డ్రైవర్ శ్రీనివాస్ కు ఈడీ అదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రవితేజ కూడా ఈడీ విచారణ కు సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ విచారణ అనంతరం ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. త్వరలోనే మరికొందరిని కూడా ఈడీ విచారించనుంది.

    English summary
    Rana daggubati ED investigation latest update
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X