మాస్ మహారాజ్ శివరాత్రి కానుక.. రెడీ అంటూ మెసేజ్
మాస్ మహారాజ్ రవితేజ మహా శివరాత్రి కానుక రెడీ చేశాడు. ఈ పవిత్రమైన రోజున ప్రేక్షకులకు పలకరించాలని ఫిక్స్ అయిన ఆయన అందుకు ముహూర్తం కూడా పెట్టేశాడు. తన తాజా సినిమా 'క్రాక్' నుంచి టీజర్ విడుదల చేస్తున్నట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ రోజు (ఫిబ్రవరి 21) సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు క్రాక్ టీజర్‌తో మీ ముందుంటున్నా అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు రవితేజ. ఈ మేరకు కొత్త పోస్టర్ షేర్ చేశాడు. ఈ పోస్టర్‌లో రవితేజ మాస్ అప్పియరెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ లుక్ చూసిన ప్రేక్షకలోకం క్రాక్ టీజర్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ మూవీ రూపొందుతోంది. క్యాచీ టైటిల్‌తో విలక్షణ కథాంశం ఎంచుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. ఈ డిఫెరెంట్ మూవీలో రవితేజ సరసన శృతి హాసన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించనుంది. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌లో బీ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











