వామ్మో ఈ వయసులో అంతటి ఫిట్‌నెస్.. నెటిజన్లు షాక్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు ఎదిగిన ఆ తీరే రవితేజకు ఎంతో మంది అభిమాన గణాన్ని తెచ్చిపెట్టింది. మాస్ మహారాజాగా టాలీవుడ్‌లో ఓ స్థాయిలో కూర్చొబెట్టింది. అయితే మాస్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్న రవితేజ.. ఒకే మూసధోరణిలో వెళ్తున్నాడని ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాలేవీ ఆడటం లేదు. అందుకే రూట్ మార్చి కొత్త కథలను ఓకే చేస్తున్నాడు.

ఈ క్రమంలో రవితేజ-వీఐ ఆనంద్ కలిసి డిస్కో రాజా అంటూ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఫిట్‌గా.. యంగ్ లుక్‌లో కనిపించబోతోన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తే ఎంత స్టైలీష్‌గా ఉందో అందరికీ తెలిసిపోతుంది. ఈ మూవీ నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా బాగానే కనెక్ట్ అయ్యాయి. సంక్రాంతి కానుకగా తన అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు మరో టీజర్‌ను కూడా రెడీ చేయబోతోన్నాడు.

Raviteja Latest Pic About His Fitness Goes Viral

అంతలోపే ఫ్యాన్స్‌కు మరో షాక్ ఇచ్చాడు. తాజాగా ఆయన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 12.5 kg డంబెల్‌తో ఎక్సర్ సైజ్ చేస్తూ.. మజిల్స్ కనబడేలా చూపిస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వయసులో సినిమా కోసం, క్యారెక్టర్ కోసం ఇంతలా కష్టపడుతున్నాడంటూ.. అందుకే మాస్ మహారాజా అయ్యాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X