RAY in Netflix.. ట్రైలర్‌లోనే అదరగొట్టిన మనోజ్ బాజ్‌పేయ్.. సత్తా చాటుకొనేందుకు శ్వేతబసు ప్రసాద్
లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ మూవీల రిలీజ్‌లు ఊపందుకొన్నాయి. భారతీయులు గర్వించదగిన లెజెండ్ సత్యజిత్ రే రచనలు, సినిమాలను స్పూర్తి పొందడం ద్వారా RAY అనే వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీ అయింది. మనోజ్ బాజ్‌పేయ్, అలీ ఫజల్ నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో రకరకాల భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఉన్నతంగా యాక్టింగ్ ప్రతిభను చాటుతున్న పలువురు నటులు తమ సత్తాను చాటుకొనే ప్రయత్నం చేశారనే విషయం ట్రైలర్‌లో స్పష్టమైంది.
Ray వెబ్ సిరీస్ నాలుగు కథల సంకలనంగా రూపొందింది. సత్యజిత్ రే లాంటి లెజెండ్ కోసం ఇద్దరు రైటర్లు, ముగ్గురు డైరెక్టర్లు, నాలుగు ఎపిసోడ్స్‌ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌లో హంగామా హై క్యో బర్పా (అభిషేక్ చౌబే), ఫర్గెట్ మీ నాట్ (శ్రీజిత్ ముఖర్జీ), బహ్రుపియా (శ్రీజిత్ ముఖర్జీ), స్పాట్‌లైట్ (వాసన్ బాలా) పేర్లతో ఎపిసోడ్స్ రూపొందించారు. ఈ అనేక ట్విస్టులు, థ్రిల్స్, మలుపులతో ఆసక్తికరంగా ఉంటుందనే విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 25, 2021న రిలీజ్ కానున్నది.
నాలుగు కథలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న Ray వెబ్ సిరీస్‌ను అభిషేక్ చౌబే, శ్రీజిత్ ముఖర్జీ, వాసన్ వాలా రూొపందించారు. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయ్, గజ్‌రాజ్ రావు, అలీ ఫజల్, శ్వేతబసు ప్రసాద్, అనిందిత బోస్, కేకే మీనన్, బిదితా బాగ్, దిబ్యేందు భట్టాచార్య, హర్షవర్ధన్ కపూర్, రాధికా మదన్, చందన్ రాయ్ సన్యాల్, అకాంక్ష రంజన్ కపూర్ తదితరులు నటించారు.

హంగామా హై క్యో బర్పా ఎపిసోడ్‌లో మనోజ్ బాజ్‌పేయ్, గజ్‌రాజ్ రావు నటించారు. ఫర్గెట్ మీ నాట్ బహ్రుపియా ఎపిసోడ్స్‌లో కేకే మీనన్, అలీ ఫజల్, శ్వేతబసు ప్రసాద్ నటించారు. స్పాట్‌లైట్‌లో హర్షవర్ధన్ కపూర్, రాధికా మదన్, చందన్ రాయ్ సన్యాల్, అకాంక్ష రంజన్ కపూర్ నటించారు.


Click it and Unblock the Notifications











