SVP సక్సెస్ పార్టీలో మహేష్ బాబు.. రెండో రోజు 60 శాతం కలెక్షన్ల డ్రాప్.. కారణం ఏమిటంటే?
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట చిత్రం రెండో రోజున కూడా ప్రతికూల పరిస్థితులను ఎదురించి గౌరవప్రదమైన వసూళ్లను నిలబెట్టుకొన్నది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం శుక్రవారం వర్కింగ్ డే కావడంతో క్రితం రోజుతో పోల్చుకొంటే భారీగానే కలెక్షన్లు పడిపోయాయి. అయితే రెండో రోజున సర్కారు వారీ పాట కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
సర్కారు వారీ పాట చిత్రం ఎప్పటి మాదిరిగా కాకుండా శుక్రవారానికి బదులుగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో రోజు శుక్రవారం వర్కింగ్ డే కావడంతో దాదాపు 60 శాతం కలెక్షన్లు పడిపోయాయి. అంతేకాకుండా సినిమా మిక్స్‌డ్ టాక్ రావడం, ఐపీఎల్ టోర్ని కూడా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ముఖం చాటేశారు. అయితే వర్కింగ్ డే రోజు కలెక్షన్లతో పోల్చుకొంటే.. మిగితా సినిమాల కంటే బెటర్‌గా ఉన్నాయని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.

సర్కారు వారీ పాట చిత్రం తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను నమోదు చేసింది. మొదటి రోజున 36.63 కోట్ల షేర్ సాధించింది. ఇక రెండో రోజున ఈ చిత్రం నైజాం, ఆంధ్రాలో మరో 11.64 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో రెండో రోజుల్లో మొత్తంగా 48.27 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అమెరికాలో రెండు రోజుల్లో మొత్తంగా 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
అయితే శుక్రవారం దారుణంగా వసూళ్లు డ్రాప్ కావడంతో ఇక శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్లు ఉంటాయనే ఆశల్ని చిత్ర యూనిట్ పెట్టుకొన్నది. ఇక ఈ సినిమా సానుకూలమైన ఫలితాలను సాధిస్తుందన్న నేపథ్యంలో నిర్మాతలు శుక్రవారం రాత్రి భారీగా విందును ఏర్పాటు చేశారు. సినిమా యూనిట్‌కు గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. సక్సెస్ పార్టీలో దర్శకుడు పరుశురాం, మహేష్ బాబు, సుకుమార్, మెహర్ రమేష్, బుచ్చిబాబు, మైత్రీ మూవీస్ నిర్మాతలు, దిల్ రాజు, శిరీష్, దర్శకుడు హరీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అయితే శని, ఆదివారాల్లో ఎలాంటి ఫలితాలను రాబడుతుందో అనే విషయంపై సినీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











