For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రేమలో వ్యక్తి మోసం చేస్తే.. లైవ్ లోనే సూసైడ్ పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

  |

  ఊహించని పరిస్థితుల్లో ఎన్నో ఆపదలు మనిషిని కష్టానికి గురి చేస్తాయి. అయితే అలాంటి కష్టాలకు ఎదురెళ్లి నిలబడటమే మన కర్తవ్యం అంటూ రేణు దేశాయ్ మరోసారి తనదైన శైలిలో మంచి సందేశం ఇచ్చారు. సోషల్ మీడియాకు గత రెండు కొన్ని రోజులుగా దూరంగా ఉన్న ఆమె మొత్తానికి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లైవ్ తో ఆడియెన్స్ ని పలకరించారు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ప్రేమలో మోసపోతే అనే ప్రశ్నకు కూడా ఆమె ఎమోషనల్ గా ఆన్సర్ ఇచ్చారు.

   సినిమాల్లో అవకాశాలు వస్తున్నా కూడా..

  సినిమాల్లో అవకాశాలు వస్తున్నా కూడా..

  ప్రేమ వివాహం అనంతరం కొన్నాళ్లకు ఆమె విడాకులు తీసుకొని పిల్లలతోనే ఉంటున్న విషయం తెలిసిందే. బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ తరువాత హీరోయిన్ గా కంటిన్యూ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. ఇక జానీ సినిమా తరువాత మళ్ళీ ఆమె తెరపై కనిపించలేదు. ఇక మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు.

   ఆధ్య కంపెనీకి సీఈఓగా..

  ఆధ్య కంపెనీకి సీఈఓగా..

  కానీ రైటర్ గా ఆమె తన టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు కవిత్వాలతో ఎంతగానో ఆలోచింపజేస్తున్నారు కూడా. ఆ మధ్య ఇష్క్ వాలా అనే సినిమాతో దర్శకురాలిగా మారి తనలోని కొత్త టాలెంట్ ని కూడా బయటపెట్టారు. ఇక నెక్స్ట్ ఆధ్య అనే వెబ్ సిరిస్ ద్వారా మళ్ళీ కెమెరా ముందు తన యాక్టింగ్ స్కిల్స్ ని చూపించబోతున్నట్లు చెప్పారు. అందులో ఆధ్య అనే కంపెనీకి సీఈఓగా కనిపిస్తానని క్లారిటీ ఇచ్చారు రేణు దేశాయ్.

  ప్రేమలో ఓడిపోతే..

  ప్రేమలో ఓడిపోతే..

  ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బిజీగా ఉండే రేణు దేశాయ్ సామాజిక అంశాలపై కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఆమె ఒక సెన్సిటివ్ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రేమలో ఓడిపోతే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి? అలా సెన్సిటివ్ గా ఉండేవాళ్లకు ఒక మంచి మెస్సేజ్ ఇవ్వండని కోరగా రేణు దేశాయ్ స్పంధించారు.

  ఎవరైనా మనల్ని మోసం చేస్తే

  ఎవరైనా మనల్ని మోసం చేస్తే

  రేణు దేశాయ్ మాట్లాడుతూ.. మీ కంటే ఎవరు మీ జీవితంలో ఇంపార్టెంట్ కాదు. మీ ప్రాణం అన్నిటి కంటే ముఖ్యం. లవ్ లో ఫెయిల్ అయితే బాధగా ఉంటుంది నిజమే. ప్రేమలో ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఆ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టమే. కానీ దానికి ఆత్మహత్య అనేది దారి కాకూడదు. అలాంటి సమయంలో కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా మంచిదని అన్నారు.

  Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
  బాధలో నుంచి ఎలా బయటపడాలంటే..

  బాధలో నుంచి ఎలా బయటపడాలంటే..

  అదే విధంగా అలాంటి బాధలో నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి కూడా రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు. ఆ బాధ నుంచి కోలుకోవడం చాలా ముఖ్యం అంటూ మీ ఫ్యామిలీ లేదా స్నేహితులతో గడపండని చెప్పారు. ఇక ఎప్పుడైనా సరే ఒక మనిషి జీవితం మరొక పర్సన్ కారణంగా ఎండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని నిజంగా ఇది నమ్మండి అంటూ రేణు దేశాయ్ తన మాటలతో ఆకట్టుకున్నారు.

  నిహారిక పెళ్లిపై నెటిజన్ల ప్రశ్నలు

  నిహారిక పెళ్లిపై నెటిజన్ల ప్రశ్నలు

  ఇక లైవ్ లో రేణు దేశాయ్ ని ఎక్కువగా అడిగిన ప్రశ్న నిహారిక పెళ్లి గురించి. నిహారిక పెళ్లికి వెళుతున్నారా లేదా? అంటూ ఆమె ఫాలోవర్స్ చాలా ప్రశ్నలు వేశారు. కానీ రేణు దేశాయ్ అసలు ఆ ప్రశ్న గురించి పట్టించుకోలేదు. చాలా విషయాల గురించి మాట్లాడారు గాని నిహారిక మ్యారేజ్ పై ఎన్ని ప్రశ్నలు వచ్చినా స్పందించకపోవడం ఆశ్చర్యం.

  మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఆధ్య, అకిరా

  మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఆధ్య, అకిరా

  ఇక రేణు మెగా ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉన్నప్పటికి పిల్లలు మాత్రం ఎలాంటి వేడుకలు జరిగినా మెగా కుటుంబానికి దగ్గరగా ఉంటున్నారు. ఆధ్య, అకిరా గతంలో మెగా హీరోలతో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్ తన చెల్లి అంటూ ఆ మధ్య బర్త్ డే విషెస్ కూడా అందించాడు. అకిరా పుట్టినరోజున కూడా మెగా హీరోలందరు విషెస్ అందించిన విషయం తెలిసిందే.

  English summary
  Many people comment that nepotism in the cinema industry is completely understandable in what range. Even before the death of Sushant, the word nepotism was not so viral. But when he became suicidal, the word became a hot topic not only in Bollywood but also in other industries. Recently Renu Desai has also commented on nepotism,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X