Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆర్జీవీ సినిమా.. బీచ్ లో ‘బ్యూటిఫుల్’ ఫోటోలు.. చూస్తే ఆపుకోలేరు..
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. సినిమాలు ఉన్నా లేకపోయినా.. ఆయన చుట్టు మాత్రం వివాదాలు ఉంటాయి. ఆర్జీవీ తెలియని వాడంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆర్జీవీ ఫేమస్. సినిమా టైటిల్ విషయంలో అయితే ఆర్జీవీ చూపే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు.. టైటిల్ తోనే సినిమాను ఓ రేంజ్లో నిలబెడతాడు.
సినిమాను తెరకెక్కించడంలో మాత్రమే కాదు, పబ్లిసిటీ విషయంలోనూ కొత్తగా ట్రై చేస్తుంటాడు. ఉన్నది ఉన్నట్లు, తనకు నచ్చినట్లు బతికే ఆర్జీవి అంటే ఎంతో మందికి అభిమానం. సోషల్ మీడియాలో ఆర్జీవీకి మామూలు ఫాలోయింగ్ ఉండదు. అతను వేసే పంచ్ లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ మళ్లీ వేడి వాతావరణాన్ని పుట్టించేందుకు రెడీ అవుతున్నాడు. మరో వైపు కుర్రాళ్ల ఒంట్లో వేడి పుట్టించేలా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పోస్టర్స్ ను చూస్తే ఎవరికైనా హార్ట్ బీట్ పెరగాల్సిందే అనేలా ఉన్నాయి.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా). నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా నటిస్తున్నారు. అగస్త్య మంజు దర్శకుడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మతో పాటు అగస్త్య మంజు సహ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాణమవుతున్న రామ్ గోపాల్ వర్మ చిత్రమిది. టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. వైవిధ్య భరిత అంశాలతో ఆకట్టుకోనున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా...సంగీతాన్ని రవి శంకర్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వ బాధ్యతలను అగస్త్య మంజు తీసుకున్నారు.