For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డబ్బు కోసమే అలాంటివి చేసింది.. షకీలా బయోపిక్ పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  |

  బి గ్రేడ్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఒకప్పటి నటిమణుల్లో షకీలా ఒకరు. బోల్డ్ పాత్రలతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అప్పట్లో బి గ్రేడ్ పాత్రలతో అగ్ర హీరోల రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్నప్పటికి ఆమె సంపాదననను వెనకేసుకోలేక పోయింది. ఇక ఆమె బయోపిక్ త్వరలోనే తెలుగులో రిలీజ్ కానుంది..ఈ సందర్భంగా షకీలా పాత్రలో నటించిన రిచా చద్దా షకీలా గురించి ఎవరు ఊహించని విధంగా స్పందించింది.

  స్టార్ హీరోలకు పోటీగా..

  స్టార్ హీరోలకు పోటీగా..

  షకీలా అంటే తెలియని సౌత్ ఆడియెన్స్ ఉండరు. 90ల కాలంలో ఆమె ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న నటిమణుల్లో ఒకరు. బి గ్రేడ్ సినిమాలతో మలయాళం ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసిన షకీలా ఒకప్పటి స్టార్ హీరోలను కూడా బయపెట్టింది. ఒక ఏడాదిలోనే 20కి పైగా సినిమాలు చేసి బిజీ ఆర్టిస్ట్ గా క్రేజ్ అందుకుంది.

  షకీలా బయోపిక్..

  షకీలా బయోపిక్..

  మాలయాళంలోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలు రీమేక్ అయ్యేవి. ఇక షకీలా జీవిత ఆధారంగా బాలీవుడ్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్లు గత రెండేళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రిచా చద్దా షకీలా పాత్రలో కనిపించనుంది. ఇటీవల సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఫైనల్ గా తెలుగులో కూడా విడుదలకు సిద్ధమైంది.

  ప్రమోషన్ లో బిజీ బిజీగా..

  ప్రమోషన్ లో బిజీ బిజీగా..

  పోస్టర్స్ తోనే గత ఏడాది నుంచి మంచి బజ్ క్రియేట్ చేస్తూ వస్తున్న షకీలా బయోపిక్ ను ఇంద్రజిత్ లంకేశ్ డైరెక్ట్ చేశాడు. గత ఏడాది ఎండింగ్ లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారట. కానీ ఆర్థిక కారణాలతో పాటు ఆ తరువాత లాక్ డౌన్ దెబ్బ కొట్టడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక రిచా చద్దా రెగ్యులర్ ప్రమోషన్స్ లో పాల్గొంటు ఆసక్తికరమైన విషయాలతో మంచి బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

  డబ్బు కోసమే అలా చేసింది

  డబ్బు కోసమే అలా చేసింది

  రిచా చద్దా మాట్లాడుతూ.. అందం అనేసరికి మన దేశంలో విభిన్న రకాల ఆలోచనలు ఉంటాయి. అలాగే షకీలా కూడా భావించింది. మొదట ఆమె బీ గ్రేడ్ సినిమాలు చేయాలని అనుకోలేదు. అలాంటి సినిమాల్లో చేయడం ఇష్టం లేదు. అయినప్పటికీ ఆమె డబ్బు కోసం చేయక తప్పలేదు. ఆర్థిక కారణాల వల్లనే ఆమెను అలాంటి సినిమాలు చేయమని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేశారని తెలుసుకున్నట్లు.. రిచా చద్దా వివరణ ఇచ్చింది.

  పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న షకీలా

  పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న షకీలా

  ఇక సినిమా విడుదల సందర్భంగా కొన్నిరోజుల క్రితం షకీలా ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. త్వరలో రాజకీయాల్లోకి కూడా రానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తారా అని చాలా మంది అడుగుతున్నారని అయితే అభిమానుల కోరిక మేరకు తప్పకుండా ప్రజాసేవ చేయడానికి సిద్ధమవుతానని తెలిపారు. దీంతో ఆ వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

  Vidya Nirvana, Daughter Of Manchu Lakshmi Breaks World Record

  పార్టీ ముఖ్యం కాదు..

  ఇక షకీలా ఏ పార్టీలో చేరబోతున్నారు అనే విషయం కూడా వైరల్ అవుతుండడంతో పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చింది. ప్రజాసేవ చేయడానికి పార్టీ ముఖ్యం కాదు అంటూ ఏ పార్టీ ఆహ్వానించినా కూడా అందులోకి వెళతానని ఆమె తెలిపారు. ఇక బయోపిక్ గురించి మాట్లాడుతూ.. నటీనటులకు, ఓ వర్గం మహిళలకు ఒక మంచి పాఠంలా ఉంటుందని అన్నారు.

  English summary
  Bold rolls in the Tollywood industry have become commonplace these days. Depending on the character, some glamor dose increases. But at one time Shakeela was one of those who made a name for bold characters. The Bee Grade movies she made were a sensation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X