For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Coffee With A Killer Trailer అనిల్ రావిపూడి ఆవిష్కరించిన థ్రిల్లింగ్ ట్రైలర్.. ఆర్పీ పట్నాయక్ దర్శకుడిగా!

  |

  ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ మెగాఫోన్ పట్టారు. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బట్టల రామస్వామి బయోపిక్కు లాంటి సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరొందిన సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మిస్తోన్న చిత్రం కాఫీ విత్ ఎ కిల్లర్. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

  RP Patnaik

  అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''కరోనా పాండమిక్ తర్వాత రిలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదరగొడుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు మంచి ఆదరణ కనిపిస్తున్నది. కాఫీ విత్ ఎ కిల్లర్ ట్రైలర్‌ ఆసక్తిని పెంచింది. ఈ ట్రైలర్ చూశాక నాకు ఆర్పీ పట్నాయక్ హీరోనా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే.. కథే హీరో కనుక ఆ కథను మలిచింది ఆయనే కనుక. ఆర్పీ గారు ఏ క్రాఫ్ట్‌కు వెళ్ళినా సక్సెస్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.. ఎందుకంటే మేము టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆయన కంపోజ్ చేసిన పాటలే ఎక్కువగా వినే వాళ్ళం. ఆ పాటలే లేకుంటే మా టీనేజ్ అంతా ఏమైపోయేదో.. మమ్మల్ని అంత ఇంప్రెస్ చేశాయి. ఇక ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరితో నా కెరీర్ మొదటి నుంచి కలిసి ట్రావెల్ చేశాను. ఫ్రెండ్స్ మధ్య ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ.. టీమ్‌కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని అన్నారు.

  అతిథిగా హాజరైన నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. మొదట ఈ టైటిల్ చెప్పగానే 'కాఫీ విత్ ఎ కిల్లర్' ఏంటి? కాఫీ విత్ కరణ్ లాగా అని అనుకున్నా.. బట్ ట్రైలర్ చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమా ఘన విజయం సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

  దర్శకుడు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ.. ''ఓటిటి వచ్చాక జనాలకు థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్తగా చెప్తే కానీ థియేటర్స్‌కు రప్పించలేము అనిపించే ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ 'కాఫీ విత్ ఎ కిల్లర్' సినిమా కథను రాసుకొని.. డైరెక్ట్ చేయడం జరిగింది. అందుకు నా మరో తమ్ముడు సెవెన్‌హిల్స్ సతీష్ తోడై నిర్మాతగా వ్యవహరించాడు. సెట్‌లో తన ఆవేశాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే అయ్యింది( నవ్వుతూ). కానీ, సతీష్ అలా ఉండడం వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు రాగలిగింది. ఇంకో రెండు సినిమాలు మా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కాఫీ విత్ ఎ కిల్లర్ చిత్రానికి వస్తే.. ఆరిస్టులు అందరూ చాలా సపోర్ట్ చేసినా.. వారి వెంట వచ్చిన అసిస్టెంట్స్ వల్ల బాగా ఇబ్బంది పడ్డాము. అది కాకుండా అయితే ఇట్స్ ఎ టీం వర్క్ అని చెప్పాలి. ఈజీగా చేసే సినిమా మాత్రం కాదు అని చెప్పగలను. ఈ చిత్రంలో ఒక సీక్రెట్ కూడా ఉంది.. అది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రివీల్ చేస్తాము. అందుకే ఆర్టిస్టులను ఎవర్నీ ఇక్కడికి తీసుకురాలేదు. ఒక డిఫరెంట్ అండ్ న్యూ కాన్సెప్ట్‌ను ట్రై చేశాము. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ఇక మేము పిలవగానే తను ఎంతో బిజీగా ఉన్నా.. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన అనిల్ రావిపూడి‌గారికి కృతఙ్ఞతలు.. ఎందుకో ఆయనకు నేనంటే చాలా అభిమానం. అలాగే అభిషేక్ అగర్వాల్ గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..'' అన్నారు.

  నిర్మాత సెవెన్‌హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. ''ఆర్.పి గారు నాకు సొంత బ్రదర్ లాంటి వాడు. వాళ్ళ సొంత బ్రదర్స్ తనతో పాటు ఉంటారు.. నేను బయట తనతో తిరుగుతూ ఉంటాను అంతే. ఈ సినిమా లైన్ చెప్పగానే యాక్సెప్ట్ చేయాలనుకున్నా.. ఈ సినిమాలో ఒక చిన్నసర్‌ప్రైజ్ ఉంది.. త్వరలో రివీల్ చేస్తాము. ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేసిన గౌతమ్ పట్నాయక్ కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంతదాకా వచ్చేది కాదు. ఆర్ పి గారితో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

  ఇంకా ఈ కార్యక్రమంలో రఘు కుంచె, జెమినీ సురేష్, బెనర్జీ, రవి ప్రకాష్, గౌతమ్ పట్నాయక్, అనుష్, తిరుమల నాగ్, కృష్ణారెడ్డి, డైరెక్టర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, రవి బాబు, సత్యం రాజేష్, రఘు బాబు, జెమినీ సురేష్, రవి ప్రకాష్, టెంపర్ వంశీ, బెనర్జీ తదితరులు
  క్రియేటివ్ హెడ్: గౌతమ్ పట్నాయక్
  డీవోపీ, ఎడిటర్, డీఐ: అనుష్ గౌరక్
  డైలాగ్స్: తిరుమల నాగ్
  పీఆర్వో: బీ వీరబాబు
  నిర్మాత: సెవెన్ హిల్స్ సతీష్
  రైటర్, డైరెక్టర్: ఆర్పీ పట్నాయక్

  English summary
  RP Patnaik's Coffee With A Killer is getting ready for Release. As part of promotion, Anil Ravipudi releases Coffee With A Killer Trailer
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X