twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: ఆస్కార్ కోసం రాజమౌళి టీమ్ ఖర్చు చేసింది నిజమే.. కానీ ఆ రూట్లో కాదు..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ స్థాయిని ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పెంచిన ఏకైక దర్శకుడు రాజమౌళి. నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో ఇప్పుడు RRR పేరు మరింత మారుమ్రోగుతోంది. ఇక ఆస్కార్ వరకు రావడానికి బలమైన కారణం ఉందని జక్కన్న టీమ్ భారీగా ఖర్చు చేసిందని చాలా రోజులుగా ఒక టాక్ వస్తోంది. ఖర్చు చేసిన మాట వాస్తవమే కానీ ఆ ఖర్చు మరొక రూట్లో అయ్యిందట. ఆ వివరాల్లోకి వెళితే..

    వివిధ రకాల అవార్డులు

    వివిధ రకాల అవార్డులు

    ఇదివరకే ప్రపంచ స్థాయిలో గుర్తింపును అందుకున్న RRR సినిమాకు వివిధ రకాల అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. చంద్రబోస్ రచించిన ఈ పాట రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ పాడిన విధానం అలాగే రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేసిన విధానం కూడా మరింత హైలెట్ గా నిలిచింది. కీరవాణి మ్యూజిక్ స్టామినా ఏమిటో కూడా మరోసారి అర్థమయింది.

    గర్వించే విధంగా..

    గర్వించే విధంగా..

    అయితే నాటు నాటు పాట ఇప్పుడు ప్రపంచ స్థాయిలో నిలవడం అకాడమీ అవార్డ్స్ లో కూడా ఈ పాటకు నామినేషన్ దొరకడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా ఇండియా మొత్తానికి కూడా గర్వించదగిన విషయమని చెప్పవచ్చు. అయితే ఈ పాట ఆస్కార్ అవార్డ్స్ వరకు వెళ్లడానికి చిత్ర యూనిట్ భారీగా ఖర్చు చేసింది అని ఇందులో కూడా పాలిటిక్స్ ఉన్నాయి అనే విధంగా కూడా కొన్ని చెత్త వార్తలు అయితే చాలానే వచ్చాయి.

    ఆస్కార్ గెలవాలంటే..

    ఆస్కార్ గెలవాలంటే..

    నిజానికి ఆ విధంగా ఆస్కార్ గెలవాలి అనుకుంటే.. చాలామంది హాలీవుడ్ నటి నటీనటులు వందల కోట్లు ఖర్చు చేయగల సత్తా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ ను ఎలా సెలెక్ట్ చేస్తారు అలాగే నామినేషన్స్ ఎలా జరుగుతాయి అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. గతంలోనే ఈ విషయంపై బాహుబలి నిర్మాత కూడా అందరికీ కౌంటర్ ఇచ్చే విధంగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు.

    ప్రమోట్ చేయడం కోసం..

    ప్రమోట్ చేయడం కోసం..

    అయితే RRR సాంగ్ గోల్డెన్ గ్లోబల్ అవార్డు దక్కించుకోవడం. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడం వెనుక RRR టీం కృషి అయితే చాలానే ఉంది. సినిమాను హైలైట్ అయ్యే విధంగా ముందుగా రాజమౌళి టీమ్ చాలా ప్రమోషన్స్ చేసింది. ముఖ్యంగా జపాన్లో కూడా ప్రత్యేకంగా సినిమాను ప్రమోట్ చేసి భారీ స్థాయిలో వసూళ్ళను అందుకునేలా చేసింది. ఒక విధంగా ఈ సినిమా హాలీవుడ్ లో హైలెట్ కావడానికి ప్రధానంగా వెరైటీ అనే ఒక ఆంగ్ల మీడియా చాలా ఉపయోగపడింది.

    50 కోట్ల ఖర్చు నిజమేనా?

    50 కోట్ల ఖర్చు నిజమేనా?

    ఆస్కార్ అవార్డు రావడం కోసమే ఎంత మాత్రం ఖర్చు చేయలేదు కానీ సినిమాను ప్రమోట్ చేసి అందరూ మాట్లాడుకునేలా కంటెంట్ తోనే ప్రమోట్ చేశారు. దాని కోసం రాజమౌళి టీమ్ ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో అయితే దాదాపు 50 కోట్ల వరకు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఖర్చు చేశారని ఒక టాక్ అయితే వినిపించింది. కానీ అందులో కూడా నిజం లేదు. కొంతవరకు అయితే ఈ సినిమాను ఇంగ్లీష్ మీడియాలో హైలెట్ చేయడం కోసం వివిధ రకాల ఆర్టికల్స్ అలాగే ఇంటర్వ్యూల కోసం కొంత ఖర్చు చేశారట. ఆ విధంగానే కంటెంట్ ను హైలైట్ చేసి ఇప్పుడు అవార్డులు అందుకునే వరకు వెళ్లారు. మరి ఆస్కార్ అవార్డును ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.

    English summary
    RRR movie oscar nominations behind the story and rumours
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X