twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా భూతాన్ని తరిమికొడుదాం.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కోవిడ్ చిట్కాలు..

    |

    తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్నది. ఆంధ్ర, తెలంగాణలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా బారిన పడిన పేషెంట్లతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎస్ థమన్ కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు చెబుతూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో పేర్కొన్న ప్రకారం..

    ఎవరైనా వర్క్ నుంచి ఇంటికి చేరుకొన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఇలాంటివి పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉంటాం. కరోనా భూతాన్ని ఎదురించడానికి ఇవన్నీ తోడ్పాటనందిస్తాయి అంటూ థమన్ పేర్కొన్నారు.

    S Thamans precautions and alert list about Coronavirus

    1. ప్రతీ రోజు వేడి నీళ్లతో ఆవిరి పట్టుకోవాలి.
    2. ఉప్పు కలిపిన నీళ్లతో పుక్కిలింతలు చేయాలి
    3. ఇంటికి రాగానే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడూ శానిటైజ్ చేసుకోవాలి
    4. డ్యూటీ నుంచి ఇంటికి చేరుకోగానే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి లేదా శానిటైజర్‌తో చేతులు క్లీన్ చేసుకోవాలి అంటూ తన ట్వీట్‌లో చెప్పారు.

    ఇక తమన్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో అరవింద సమేత, అల వైకుంఠపురం చిత్రాలతో బ్లాక్‌బస్టర్లను సొంతం చేసుకొన్నాడు. తాజాగా రిలీజైన వకీల్ సాబ్ చిత్రంతో మరోసారి సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకొన్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, బాలకృష్ణ నటిస్తున్న అఖండ చిత్రాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

    English summary
    Music Director S Thaman's precautions list about Coronavirus which strong in Telugu states. In this occassion, Thaman tweets that, LEASE FOLLOW AFTER U COME BACK FROM WORK. LETS FIGHT THIS CORONA STRONG.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X