‘సాహో’ న్యూ రిలీజ్ డేట్ పోస్టర్: ప్రభాస్-శద్ధా రొమాంటిక్ లుక్ సూపర్

ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ 'సాహో'. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం, పోస్టు ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కావడంతో నిర్మాతలు రిలీజ్ డేట్ ఆగస్టు 30కి వాయిదా వేశారు.

నిర్మాతలు తాజాగా మార్పు చేయబడిన రిలీజ్ డేట్‌తో కూడిన కొత్త పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఒకరికళ్లలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటున్నట్లు ఉన్న ఈ రొమాంటిక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Saaho new release date August 30th poster released

క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని భావించామని, పోస్ట్ ప్రొడక్షన్ మరింత క్వాలిటీగా రావాలనే ఉద్దేశ్యంతో రిలీజ్ డేట్ వాయిదా వేసినట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ మూవీని ప్యాన్ ఇండియా వైడ్ ఆగస్ట్ 30 గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. సాహో యాక్షన్ సీన్లు భారతీయ సినీ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా అబుదాబిలో చిత్రీకరించిన 8 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ మొత్తానికి హైలెట్ అయ్యేలా ఉంటుందన్నారు.

'సాహో' చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎవలీన్ శర్మ లాంటి బాలీవుడ్ తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన యాక్షన్ సినిమాలు అన్నింటినీ మించి పోయేలా ఈ చిత్రం ఉంటుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X