అల్లు అర్జున్ పై సాయిదుర్గా తేజ్ షాకింగ్ కామెంట్స్ .. ఆయన గొప్పోడు అంటూ..
Sai Dharam Tej- Allu Arjun: తెలుగు సినీ పరిశ్రమలో మెగా-అల్లు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు కుటుంబాల నుంచి ఎన్నో స్టార్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ ప్రతిభతో మంచి గుర్తింపు సంపాదించారు. జాతీయస్థాయిలోనే కాక, అంతర్జాతీయంగా కూడా వారి సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి. అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. అయితే.. తాజాగా, ఐకాన్ స్థాయి స్టార్ అల్లు అర్జున్ గురించి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను షాక్‌లో పెట్టాయి. హైదరాబాద్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో తేజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'ది ఫాస్ట్ అండ్ క్యూరియస్ - ఆటో ఎక్స్పో 2025'ఈవెంట్‌లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చీఫ్ గెస్ట్ పాల్గొన్నారు. ఈ సమయంలో అభిమానులతో కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ సమయంలో ఒక అభిమాని ఆయనను "అల్లు అర్జున్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అని ప్రశ్నించగా.. కాసేపు ఆలోచించిన తేజ్ 'అల్లు అర్జున్ గురించి నేనేం చెప్పాలి. ఆయన సూపర్.. సూపర్ గా యాక్ట్ చేస్తున్నారు. అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియాగా మారిపోయారు. ఆయన చాలా గొప్పోడు అయిపోయాడు. ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ.. ఐ ప్రౌడ్ అఫ్ హిమ్'అని బదులిచ్చారు.

ఈ ఒక్క మాట సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో తేజ్ వ్యాఖ్యలపై బన్నీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు 'తేజ్ మాటల్లో కాస్త ఇర్ష్య కనిపిస్తోంది'అని అంటుంటే, 'బన్నీ అంటేనే తేజ్ కు నచ్చదు లేదు, తేజా మెగా హీరోల వెంటనే ఉంటాడు'అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం 'తేజ్ ఇప్పుడు పాజిటివ్‌గా మాట్లాడాడు, ఇది మంచి విషయం'అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. కొంతమంది బన్నీ ఫ్యాన్స్ మాత్రం "తేజ్ ఎప్పుడూ మెగా క్యాంప్‌లోనే ఉంటాడు, అల్లు ఫ్యామిలీకి దగ్గర కాదు" అని కామెంట్లు చేస్తున్నారు.
వివాదానికి కారణమేంటీ?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన, పవన్ కళ్యాన్‌కు కాకుండా అల్లు అర్జున్.. తన ఫ్రెండ్, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. మెగా - అల్లు కుటుంబాల మధ్య దూరం పెంచిందట. బన్నీ చేసిన ఆ ఒక్క పని మెగా ఫ్యాన్స్‌కు కోపానికి కారణమైంది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం బన్నీకి విరుద్ధంగా మారారనే టాక్ కూడా వచ్చింది. ముఖ్యంగా తేజ్.. సోషల్ మీడియాల నుంచి బన్నీని తొలగించాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవని టాక్. ఇక చాలా గ్యాప్ తరువాత బన్నీ గురించి తేజ్ మాట్లాడేసరికి మరోసారి ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియల సందర్భంగా పవన్ కళ్యాణ్- అల్లు అర్జున్ ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సందర్భంలో మెగా-అల్లు కుటుంబాల సభ్యులంతా ఒక్కచోట చేరి, బాధలో ఉన్న అల్లు కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సంఘటనతో ఇరువురి మధ్య ఉన్న చల్లదనం కరుగుతున్నట్టే కనిపించింది. ఇంతకాలంగా మెగా- అల్లు క్యాంపుల మధ్య ఉన్న విభేదాల ఊహాగానాలకు ఈ ఘటన పుల్ స్టాప్ పెట్టిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి పాజిటివ్‌గా చేసిన వ్యాఖ్యలు కూడా, రెండు కుటుంబాల మధ్య మళ్లీ స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతోందన్న సంకేతాలుగా అభిమానులు చూస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన చివరగా పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన 'Bro'సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన 'సంబరాల ఏటిగట్టు' అనే పీరియాడికల్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ కె.పి. దర్శకత్వం వహిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో తేజ్ తన లుక్‌ను పూర్తిగా మార్చి 8 ప్యాక్ బాడీతో అలరించనున్నాడు. ఈ మూవీ టీజర్ అక్టోబర్ 15న, అంటే తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications










