Just In
- 40 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అంతా బాగుంది.. కానీ సమంతనే లేదు.. అక్కినేని ఫ్యాన్స్ హర్ట్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత విషయంలో ఆమె ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ పాపులారిటీ ఉన్న హీరోయిన్ అయినప్పటికీ ఆమెను కాదని ఎలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ సమంత ఫ్యాన్స్ ఎందుకు హర్ట్ అయ్యారు? అసలు విషయం ఏంటి? వివరాల్లోకి పోతే..

శర్వానంద్ సరసన సమంత
వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న సమంత ఇటీవలే 'ఓ బేబీ'గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ఈ మూవీ అంచనాలను మించి రాణించింది. దీంతో అదే జోష్‌లో శర్వానంద్ సరసన చేరింది సామ్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఎడారిలో శర్వానంద్ ప్రయాణం.. వెరీ డిఫరెంట్
ఈ చిత్రానికి 'జాను' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఓ డిఫరెంట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో సమంత పేరు జానకి అలియాస్ జాను.. అందుకే ఈ సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. కానీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో మాత్రం సమంతను చూపించలేదు. ఎడారిలో ఒంటెలతో శర్వానంద్ ప్రయాణిస్తున్నట్లు ఈ లుక్ వదిలారు.

అంతా బాగుంది.. కానీ సమంతనే
దీంతో ఈ లుక్ చూసిన నెటిజన్లు 'జాను' అనే టైటిల్‌ని, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మెచ్చుకుంటూనే ఒకింత తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'అంతా బాగుంది.. కానీ సమంతను చూపించక పోవడం హర్ట్ చేసింది' అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ జాను లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

96 రీమేక్.. దిల్ రాజు నిర్మాణం
తమిళంలో సూపర్ హిట్ సాధించిన '96' మూవీకి ఇది రీమేక్. ఒరిజినల్‌ను రూపొందించిన సి. ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. "ఎ ట్రిబ్యూట్ టు అన్‌కండిషనల్ లవ్" అని ట్యాగ్ చేస్తూ 'జాను' పోస్టర్‌ను తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు.

శర్వానంద్, సమంత క్లాస్‌మేట్స్
చిత్రంలో చిన్ననాటి స్నేహితులుగా, క్లాస్‌మేట్స్‌గా శర్వానంద్, సమంత కనిపించనున్నారు. కథ ప్రకారం పెద్దయ్యాక ఓ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా ఎలా కలుసుకున్నారు? తమ పాత రోజుల్ని ఎలా జ్ఞాపకం చేసుకున్నారు? ఆ తర్వాత కథలో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయనేది ఈ సినిమాలో చూపించనున్నారు.