Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరిలేరు నీకెవ్వరు ఆంథెమ్: హైలైట్ అవుతున్న దేవీ శ్రీ లిరిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి మరో సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ''సరిలేరు నీకెవ్వరు ఆంథమ్'' విడుదల చేశారు.
దేశ సైనికుల గొప్పతనాన్ని, వారి త్యాగాల్ని గుర్తు చేస్తూ రూపొందించిన ఈ పాట నిజంగా మనసును కదిలించే విధంగా ఉంది. ''మారణాయుధాలు ఎన్ని ఎదురైనా.. ప్రాణాన్ని ఎదురు పంపేవాడు.. ఒకడే ఒకడు వాడే సైనికుడు..'' అంటూ రొమ్ములు నిక్కబొడిచేలా ఉన్న లిరిక్స్‌తో ఈ పాట ఆకట్టుకుంటోంది.

శంకర్ మహదేవన్ ఆలపించిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించడం విశేషం. ఇక ఈ పాట కోసం దేవిశ్రీ యూరప్ వెళ్లి అక్కడి కళాకారులతో కలిసి మ్యూజిక్‌ని కంపోజ్ చేశారు దేవీ శ్రీ. ప్రస్తుతం ఈ సాంగ్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఇదే సాంగ్ హైలైట్ అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఘట్టమనేని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.