Just In
Don't Miss!
- News
పాక్షిక స్వేచ్ఛా?.. అబద్ధాలు, అర్థసత్యాలు వద్దు: యూఎస్ ఎన్జీవోపై భారత్ ఆగ్రహం
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Automobiles
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- Lifestyle
పడకగదిలో ధైర్యంగా కార్యం కొనసాగించేందుకు ఈ చిట్కాలు పాటించండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Sarileru Neekevvaru Trailer: చుట్టూ వంద మంది.. మధ్యలో ఒక్కడు.. మహేష్ అభిమానులకు పండగే పండగ
మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తూ టాక్ అఫ్ ది టాలీవుడ్ అవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ టాలీవుడ్ స్టామినా ఏంటో తెలియజేసింది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. వివరాల్లోకి పోతే..

టీజర్‌లో మహేష్ విశ్వరూపం
మీరెవరు మాకు తెలీదు.. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు.. కానీ మీ కోసం మీ పిల్లల కోసం పగలు రాత్రి ఎండా వానా..అని లేకుండా పోరాడుతూనే ఉంటాం.. ఎందుకంటే మీరు మా బాధ్యత.. మీరంతా మేము కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటామురా, భయపడే బేరానికొస్తాడు.. మన దగ్గర బేరాలేవ్వమ్మా.. అనే పవర్‌ఫుల్ డైలాగ్‌లతో టీజర్‌లో మహేష్ విశ్వరూపం చూపించాడు.

చిరంజీవి లాంచ్ చేసిన ట్రైలర్
సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ చూడాలని తనకు ఆతృతగా ఉందని చెబుతూ రిమోట్ నొక్కారు.

టీజర్‌ని మించిన ట్రైలర్
ఈ రోజు సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ టీజర్‌ని మించి ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు, రష్మిక మందన్న కెమిస్ట్రీ, కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయని ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది.

హ్యాండ్సమ్ కుర్రాడిని చూపించవయ్యా..
దేవుడా ఓ క్యూట్.. స్వీట్..హ్యాండ్సమ్ కుర్రాడిని చూపించవయ్యా అంటూ రష్మిక మందన్న చెబుతున్న డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ 2 నిమిషాల 24 సెకనుల నిడివితో రచ్చ రచ్చ చేసింది. ట్రైన్ కామెడీ సీన్స్, బండ్ల గణేష్ పర్‌ఫార్‌మెన్స్, కామెడీ టైమింగ్ హైలైట్ అవుతున్నాయి.
చుట్టూ వంద మంది.. మధ్యలో ఒక్కడు
చుట్టూ వంద మంది.. మధ్యలో ఒక్కడు.. టచ్ చెయ్.. వెళ్లి టచ్ చెయ్ అంటూ విజయశాంతి చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్ చూస్తుంటే ఆమె క్యారెక్టర్ ఎంత బలంగా ఉండనుండో తెలుస్తోంది. ఇక ప్రకాష్ రాజ్- మహేష్ బాబు మధ్య షూట్ చేసిన సన్నివేశాలు, మహేష్ డైలాగ్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు
సూపర్ స్టార్ మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి ముఖ్యపాత్ర పోషించింది. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఘట్టమనేని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.