Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పెద్ద హీరోలు కూడా చేయని డేర్ చేస్తున్న సత్యదేవ్.. థియేటర్స్ కి వచ్చేస్తున్నాడు!
కరోనా మహమ్మారి ప్రపంచం అంతటినీ ఎంతలా పట్టి కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మొదటి వేవ్ తర్వాత కాస్త పరిస్థితి కుదుట పడడంతో సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఊహించని విధంగా సెకండ్ వేవ్ వచ్చి పడటంతో అప్పటిదాకా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గింది. అయినా సరే థియేటర్ లో సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సాహసం చేయడం లేదు. సురేష్ బాబు లాంటి పెద్ద నిర్మాత కూడా తమ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో కుర్ర హీరో సత్యదేవ్ థియేటర్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటూ ప్రకటించాడు.
సత్యదేవ్ హీరోగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా బ్రహ్మాజీ, హేమ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా తిమ్మరుసు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి "తిమ్మరుసు : అసైన్మెంట్ వాలి" అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రం 21 మే 2021 న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కానీ జూలై 30వ తీదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాకి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణ సంస్థలపై మహేష్ కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమా 2019లో వచ్చిన కన్నడ చిత్రం " బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని " రీమేక్ గా తెరకెక్కింది. మరో పక్క సత్య దేవ్ తెలుగులో "గాడ్సే", "గుర్తుందా శీతాకాలం" వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతానికి తెలంగాణలో థియేటర్ లు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో సైతం 50 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లు ఓపెన్ చేసుకోవాలని సడలింపులు ఇచ్చారు.. అయినా పెద్ద సినిమాల నిర్మాతలు సహా ఎవరూ సినిమాలు రిలీజ్ చేయడానికి సాహసించని క్రమంలో సత్యదేవ్ తన సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు గా ప్రకటించారు. మొత్తంమీద సత్యదేవ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు అని చెప్పక తప్పదు.