Sebastian PC 524 teaser review.. జాకీ చాన్ స్టయిల్‌లో కిరణ్ అబ్బవరం ఎంట్రీ.. దేవుడా.. రేచీకటి అంటూ..
వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ పిసి 524 చిత్రం రిలీజ్‌కు మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నది. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మాతలుగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఫిబ్రవరి 5వ తేదీన రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాతోపాటు అన్ని ఫ్లాట్‌ఫామ్‌లో మంచి రెస్సాన్స్ వస్తున్నది. ఈ టీజర్ ఎలా ఉందంటే..

సెబాస్టియన్ పీసీ 524 చిత్రంలో కిరణ్ అబ్బవరం రేచీకటితో బాధపడే కానిస్టేబుల్‌గా నటించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, పోస్టర్లకు మంచి స్పందన లభిస్తున్నది. తెలుగులో ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. దాంతో ప్రేమోషనల్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్.. 'నీకు రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్) అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వొద్దయ్యా!' అని తల్లి చెప్పే మాటతో ప్రారంభమవుతుంది. కిరణ్ అబ్బవరం ఎంట్రీ జాకీ చాన్ స్టయిల్‌లో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పేరు ఏమో క్రిస్టియన్ లాగా ఉండాది. వచ్చింది ఏమో గుడి కాడనుండా' అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే డైలాగ్ వింటుంటే... హీరోకి భక్తి ఉందని విసయం స్పష్టమైంది.
దయగల ప్రభువా... ఈ రాత్రి మదనపల్లి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడు తండ్రి. నీకు స్తోత్రం', 'ప్రభువా... ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు', 'నేను దేవుడి బిడ్డను కాదన్నమాట' అని హీరో చెప్పే డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. మొత్తం మీద సినిమాపై టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఛాలెంజ్ లాంటి రేచీకటి సమస్య ఉన్న కానిస్టేబుల్ నైట్ డ్యూటీ ఎలా చేశాడన్నది ఆసక్తికరంగా ఉంది.
నటీనటులు: కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు
పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
డిజిటల్ పార్ట్‌నర్: టికెట్ ఫ్యాక్టరీ
పబ్లిసిటీ డిజైన్: చవన్ ప్రసాద్
స్టిల్స్: కుందన్ - శివ
సౌండ్: సింక్ సినిమాస్ సచిన్ సుధాకరన్
కాస్ట్యూమ్స్: రెబెకా - అయేషా మరియమ్
ఫైట్స్: అంజి మాస్టర్
సిజి: వీర, డీఐ: రాజు
కూర్పు: విప్లవ్ న్యసదాం
కళ: కిరణ్ మామిడి
సినిమాటోగ్రఫి: రాజ్ కె. నల్లి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎల్. మదన్
సమర్పణ: ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్
సంగీతం: జిబ్రాన్
నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, ప్రమోద్, రాజు
కథ - దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి


Click it and Unblock the Notifications











