twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jamuna షివరింగ్ ఎందుకు అవుతుందంటే.. ఆ హీరో వలన అప్పుడే ప్రాణాలు పోయే పరిస్థితి..

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు అందుకున్న అతికొద్ది మందిని నటీమణులలో జమున గారు ఒకరు. ఆమె ఎలాంటి పాత్ర చేసిన కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటారు. ఇక అలాంటి నటి కన్నుమూయడంతో ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఆమె జీవితంలో ఎన్నో విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే జమున ఎప్పుడు ఇంటర్వ్యూలో కనిపించినా కూడా షివరింగ్ అవుతు ఉండేవారు.

    అయితే వయసు ఎక్కువ కావడంతో ఆ విధంగా ఆమె వణుకుతూ ఉండేవారు అనుకునేవారు. కానీ అందుకు కారణం వేరే ఉందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్ని నెలలకి ఒక హీరో వలన ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురయింది. ఆ విషయం గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా వివరణ ఇచ్చారు. ఆ వివరాలలోకి వెళితే..

    ఎలాంటి పాత్ర చేసినా..

    ఎలాంటి పాత్ర చేసినా..

    తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న జమున ఎలాంటి పాత్రలో అయినా తనదైన శైలిలో నటించేవారు. ముఖ్యంగా సత్యభామ అనే పాత్రలో ఆమె నటించిన విధానం ఆల్ టైం బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటి అని చెప్పవచ్చు. 15 ఏళ్ల వయసులోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జమున దాదాపు 200 పైగా సినిమాల్లో నటించారు.

    అప్పటి నుంచి షివరింగ్

    అప్పటి నుంచి షివరింగ్

    అయితే జమున 1970లో కాలంలోనే చాలా డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పించారు. అయితే ఎక్కువగా ఆమె అప్పటినుంచి షివరింగ్ అవుతూ ఉండడంతో కొంతమంది అదేమీ యాక్టింగ్ అనే కామెంట్ కూడా చేశారు. అయితే ఆమె చాలా ఇంటర్వ్యూలలో వణుకుతూ కూడా సమాధానాలు ఇచ్చారు. దీంతో ఆమెకు వచ్చిన సమస్య ఏమిటి అని విషయంపై కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

    హీరో కారణంగా..

    హీరో కారణంగా..

    ఇక కొన్నేళ్ళ క్రితం ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షివరింగ్ గురించి అసలు వివరణ ఇచ్చారు. అసలు తనకు ఆ సమస్య ఎలా వచ్చింది అనే విషయం గురించి ఆమె పూర్తిగా తెలియజేశారు. లేత మనసులు తమిళంలో 1965లో వచ్చింది. అయితే ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు ఊహించిన విధంగా సినిమాలోని హీరో కారణంగా గాయపడినట్లుగా ఆమె తెలియజేశారు.

    నా తల మీద పడ్డాడు

    నా తల మీద పడ్డాడు

    ఒక సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక గడ్డివాము మీద రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అంతా బాగానే ఉంది. ఇక తరువాత టేక్ చేయాల్సి వచ్చినప్పుడు తమిళ హీరో జయ శంకర్ గడ్డివాము మీద ఎలా పడుకున్నాడో అర్థం కాలేదు. టెక్ సమయానికి వచ్చేటప్పటికి అంతటి భారీ మనిషి వచ్చి ఒక్కసారిగా నా తల మీద పడ్డాడు అప్పుడే నేను కింద కూర్చున్నాను. దీంతో అప్పుడు నాకు చాలా నొప్పి కలిగింది.. అని జమున చెప్పారు.

    మెడ విరిగిపోయింది అనుకున్నా..

    మెడ విరిగిపోయింది అనుకున్నా..

    అలా తల మీద పడడంతో నేను మెడ విరిగిపోయింది అని అనుకున్నాను. ఇక అలానే పట్టుకొని కూలిపోయాను. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి కాస్త ఐస్ కూడా పెట్టుకున్నాను. అటు ఇటు తిప్పి చూశాను. కొంతసేపటికి బాగానే అనిపించింది. ఏమీ అనిపించలేదు. ఇక తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పట్లో పెద్దగా టెక్నాలజీ ఎక్స్ రెలు లేవు అని అలా వదిలేసాను.

    బ్రెయిన్ ఆపరేషన్ అవసరమని..

    బ్రెయిన్ ఆపరేషన్ అవసరమని..

    ఆ గాయమైన తర్వాత కూడా సినిమాలు చేశాను. ఇప్పుడు కూడా నాకు పెద్దగా షివరింగ్ రాలేదు. కానీ రాజపుత్ర అనే ఒక సినిమాలో చేస్తున్నప్పుడు మాత్రం అప్పుడే ప్రేక్షకులకు అర్థమైంది. స్కానింగ్స్ వచ్చిన తర్వాత ఒకసారి తల మొత్తం పరీక్షించారు.

    అయితే ఏదో బ్రెయిన్ లో ఒక నర్వ్ అలా అంటుకుపోయి ఉంది అని స్కానింగ్ లో తెలిసింది. ఆ సమస్య వలన షివరింగ్ వచ్చిందని అర్థమైంది. అప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ అవసరమని అన్నారు. ఇక నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అది అవసరం లేదు అని దాని గురించి ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు.. అని జామున తెలియజేశారు.

    English summary
    Senior Actress jamuna shivering problem actual reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X