For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో శ్రీకాంత్ కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ .. ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి!

  |

  తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు అనేకమంది సినీ తారల వారసులు పలువురు హీరోలుగా ఎంట్రీ లు ఇవ్వడం జరిగింది. అయితే ఆ విధంగా వచ్చిన వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అయితే మరికొందరు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక ముఖ్యంగా ఇక్కడ మన పరిశ్రమలో తారల కుమార్తెలు మాత్రం వారసులుగా వచ్చిన వారు చాలా తక్కువే అనే చెప్పాలి. ఆ విధంగా వచ్చిన వారిలో మంచు లక్ష్మి ప్రసన్న, మంజుల ఘట్టమనేని, నిహారిక కొణిదెల, శివాత్మిక, శివాని వంటి వారిని గురించి చెప్పుకోవచ్చు. కాగా వీరిలో ప్రస్తుతం ఎవరికి వారు తమ టాలెంట్స్ తో ముందుకు కొనసాగుతున్నారు. ఇక త్వరలోనే మరొక సీనియర్ హీరో వారసురాలు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.

  విభిన్నమైన నటుడిగా..

  విభిన్నమైన నటుడిగా..

  అసలు విషయంలోకి వెళితే శ్రీకాంత్ కొడుకు అనంతరం ఆయన కూతురు కూడా సినిమా ఇండస్ట్రీలోకి కథానాయికగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమకి మొదట విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన నటుడు శ్రీకాంత్ ఆ తరువాత మెల్లగా హీరోగా మారి ఆపై అనేక సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ మనసులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఫ్యామిలీ హీరోగా ఆయన కెరీర్ లో చాలానే బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇక గతంలో నాగ చైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం సినిమాలో విలన్ గా చేసి తనలోని మరొక కోణాన్ని కూడా ఆడియన్స్ కి పరిచయం చేసి అందరి నుండి మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ సినిమా అనంతరం నెగిటివ్ రోల్స్ చేయమని చాలా ఆఫర్స్ వచ్చాయి.

  హీరోగా శ్రీకాంత్ వారసుడు

  హీరోగా శ్రీకాంత్ వారసుడు

  ఇక కొన్నేళ్ల క్రితం శ్రీకాంత్ తన పెద్ద తనయుడు రోషన్ ని నిర్మల కాన్వెంట్ అనే సినిమా ద్వారా హీరోగా లాంచ్ చేసారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఆపై కెరీర్ పరంగా కొంత గ్యాప్ తీసుకున్న రోషన్ ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న పెళ్లి సందడి సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ శ్రోతల నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి.

  మంచి కథ దొరికితే..

  మంచి కథ దొరికితే..

  అయితే త్వరలో శ్రీకాంత్ కూతురు మేధ కూడా హీరోయిన్ గా టాలీవుడ్ కి అరంగేట్రం చేయనున్నారు అనే వార్త ప్రస్తుతం సినిమా వర్గాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. చదువుతో పాటు నాట్యంలో కూడా మంచి ప్రావిణ్యం కలిగిన మేధ ప్రస్తుతం పలువురు శిక్షకుల దగ్గర యాక్టింగ్ కూడా నేర్చుకుంటోందని, మరోవైపు ఆమెను త్వరలో లాంచ్ చేసేందుకు సిద్దమైన శ్రీకాంత్, ఊహా ఇద్దరూ కూడా పలువురు దర్శకుల నుండి కథలు వింటున్నారని సమాచారం. మంచి కథ దొరికితే ఆమె సినీ ఎంట్రీని వారు అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్.

  క్లారిటీ ఇచ్చిన మేధ

  క్లారిటీ ఇచ్చిన మేధ

  కొద్దిరోజుల క్రితం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి రోషన్, మేధ ఇద్దరూ కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూ ద్వారా తన సోదరుడి తో పాటు తనకు కూడా సినిమాల పై కొంత ఆసక్తి ఉందని మేధ తెలిపారు. అలానే ఎప్పటికప్పుడు విడుదలయ్యే సినిమాలు చూస్తానని రాబోయే రోజుల్లో అన్నయ్య రోషన్ మంచి హీరోగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మేధ. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా శ్రీకాంత్ కూతురు మేధ ఎప్పుడు మూవీస్ ఎంట్రీ ఇస్తారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినిమా వర్గాలు.

  మంచి పాత్రలు చేయాలని

  మంచి పాత్రలు చేయాలని

  శ్రీకాంత్ కూతురికి నటనపై చాలా ఆసక్తి ఉందని తెలుస్తోంది. కొంత మంది సినీ తారలు కూడా ఆమె తన తల్లి ఊహ తరహాలోనే చాలా అందంగా ఉందని తప్పకుండా నటిగా క్లిక్కయ్యే అవకాశం కూడా ఉంటుందని సినీ ప్రముఖులు శ్రీకాంత్ కు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఊహ కూడా తన కూతురినీ సినిమా ఇండస్ట్రీలో పంపించడానికి ఏ మాత్రం సందేహించడం లేదట.మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేయమని ఇదివరకే వాళ్ళు హామీ కూడా ఇచ్చారట. ఇక మేధ నటనపై ఎంతో ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు కెరీర్ మొదట్లో మంచి పాత్రలు చేయాలని ఆలోచిస్తోందట.

  Producer Kalaipuli S Dhanu About Narappa Movie | Filmibeat Telugu
  దర్శక నిర్మాతల నుంచి ఆఫర్స్

  దర్శక నిర్మాతల నుంచి ఆఫర్స్

  కొంతమంది దర్శక నిర్మాతలు కూడా ఆమెను నటిగా పరిచయం చేస్తామని శ్రీకాంత్ కు చెప్పారట. అయితే శ్రీకాంత్ మొదట ఒప్పుకోక పోయినా ఆ తర్వాత కూతురు ఇంట్రెస్ట్ లో చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు తెలుగు సినిమా సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి శ్రీకాంత్ వారసురాలు ఏ తరహాలో అడుగులు వేస్తుందో చూడాలి. మరోవైపు శ్రీకాంత్ బాలకృష్ణ అఖండ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విడుదల కానుంది.

  English summary
  senior hero srikanth daughter tollywood entry latest update
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X