ప్రభాస్ అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్న ‘సాహో’ టీమ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సాహో' తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవబోతోంది. దాదాపు రూ. 300 కోట్ల ఖర్చుతో యూవి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని సాధారణ ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా నిర్మిస్తోంది.
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ఇప్పటికే అబుదాబిలో రూ. 90 కోట్ల ఖర్చుతో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించి చిత్ర బృందం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సెట్లో తీసిన కొన్ని సీన్లును ఆ మధ్య టీజర్, మేకింగ్ వీడియో ద్వారా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదే తరహాలో 'సాహో' టీం మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. షేడ్స్ ఆఫ్ సాహో 2 పేరుతో మరో టీజర్ మార్చి 3న విడుదల చేయబోతున్నారట. ప్రత్యేకమైన డినో-యూరి 18 కెడబ్ల్యు ద్వారా చిత్రీకరించిన షాట్స్ ప్రేక్షకులు స్టన్నయ్యే విధంగా ఉంటాయట.
ప్రస్తుతం సాహో షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దాదాపు రూ. 20 కోట్ల ఖర్చుతో బాంద్రా-వర్లీ సీ లింక్ బ్రిడ్జ్‌ను పోలి ఉండే సెట్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు. మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











