twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oke Oka Jeevitham Twitter Review: శర్వానంద్ కెరీర్ బెస్ట్..కానీ.. ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే?

    |

    వరుస అపజయాలతో కాస్త సతమతమవుతున్న హీరో శర్వానంద్ ఈసారి ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా అమల అక్కినేని తల్లి పాత్రలో నటించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొత్తానికి తెలుగు తమిళ్ లో నేడు వరల్డ్ వైడ్ గా విడుదలయ్యింది. ఇక సినిమా స్పెషల్ ప్రీమియర్స్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో ఈ విధంగా వివరణ ఇస్తున్నారు..

    పాజిటివ్ పాయింట్స్

    ఒకే ఒక జీవితం టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ తరహాలో శ్రీ కార్తీక్ తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ప్రియదర్శి కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. సినిమాలో పాజిటివ్ అంశాలపై ఎక్కువమంది వారి వివరణ ఇస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని కథ అలాగే పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్న విధానం సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంది అని విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి అని చెబుతున్నారు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రమే నీరసంగా అనిపించవచ్చు అని కూడా చెబుతున్నారు.

    ఎమోషనల్ గా..


    సినిమాలో ఎమోషన్ కూడా చాలా బలంగా ఉంది అని కథను ట్రావెల్ చేసిన విధానం కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి అంటూ క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉందని చెబుతున్నారు. ఇక చివరలో శర్వానంద్ అమల నటన కూడా భావోద్వేగానికి గురిచేస్తుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    శర్వానంద్ నటన

    ఒకే ఒక జీవితం కుటుంబ కథా చిత్రం అని కదా టెర్రిఫిక్ గా ఉంది అంటూ మరికొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ నటన సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీ కి కనెక్ట్ చేసేలా ఉంది అని పెద్దగా హడావుడి లేకుండా చాలా కరెక్ట్ గా సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లుగా దర్శకుడి పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

    ట్విస్ట్ తో పాటు కామెడీ


    ఒకే ఒక జీవితంలో.. అన్ని రకాల ఎమోషన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటూ సినిమాలోని ట్విస్ట్ తో పాటు కామెడీ మిగతా ఎమోషన్స్ కథకు అనుగుణంగా ఉన్నాయి అని ప్రతి ఒక్కదాన్ని కూడా సరైన క్రమంలో పొందుపరిచినట్లు అనిపించింది అని అంటున్నారు. ఇక మొత్తంగా చూస్తే శర్వా కెరీర్ లోనే ఇది బెస్ట్ సినిమా అని థియేటర్లో చూడడమే ఉత్తమమని మరి కొంతమంది వారి వివరణ ఇస్తున్నారు.

    శర్వా కెరీర్ బెస్ట్ ఫిల్మ్


    ఒకే ఒక జీవితం సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వస్తూ ఉండడంతో మిగతా హీరోల అభిమానులు కూడా శర్వానంద్ కు ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు మెగా అభిమానుల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. ఏదేమైనా కూడా శర్వానంద్ చాలా రోజుల తర్వాత తన కెరీర్ ను మరో లెవెల్ కి తీసుకువెళ్లే విధంగా సక్సెస్ అందుకున్నాడు అని చెబుతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Sharwanand Oke Oka Jeevitham movie Twitter Review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X