twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాణాలను లెక్కచేయడం లేదు.. జీహెచ్ఎంసీ కార్మికులకు అండగా శేఖర్ కమ్ముల

    |

    కరోనా లాక్‌డౌన్‌ ఉచ్చులో బందీగా మారిన హైదరాబాద్‌ను పరిరక్షించేందుకు పోలీసులు, వైద్యులు, పారిశుద్ద కార్మికులు, జర్నలిస్టుల ఇలా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. వారికి అండగా నిలిచేందుకు ప్రముఖులు, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు.

    తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ప్రాణాలను లెక్క చేయకుండా నగర పరిశుభ్రత కోసం పాటు పడుతున్న కార్మికులపై దర్శకుడు శేఖర్ కమ్ముల మానవత్వం ప్రదర్శించారు. వేసవికాలంలో మండుటెండలను చూడకుండా పరిశుభ్రతకు పాటుపడుతున్న వారికి మజ్జిగ, కూల్ డ్రింక్స్, బాదాం మిల్క్ లాంటి అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారుల సహాయంతో హైదరాబాద్ జంట నగరాల్లో పారిశుద్ధ కార్మికులకు చల్లటి పానీయాలు అందించారు.

     Shekhar Kammula helping hand to GHMC workers

    కరోనా లాక్‌డౌన్‌లో అందరూ ఇంటికే పరిమితమైతే.. పారిశుద్ధ కార్మికులు మాత్రం రోజంతా రోడ్లపై పనిచేస్తున్నారు. ఎండలో వారు పనిచేస్తున్న తీరు చూసి బాధనిపించింది. వారికి ఎంతైనా కొంత సేవల చేయాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకొన్నాను. తమ చుట్టుపక్కల ఉండే కార్మికుల తోచినంతగా సహాయం చేయాలని శేఖర్ కమ్ముల కోరారు.

    కెరీర్ విషయానికి వస్తే.. ఫిదా చిత్రం తర్వాత ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవితో కలిసి లవ్ స్టోరి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    English summary
    Shekhar Kammula helping hand to GHMC workers. He decided to serve Butter milk, Badam milk to GHMC workers amid Coronavirus crisis
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X