twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగన రనౌత్‌పై దేశద్రోహం కేసు.. ముంబై మీ జాగీరా?, పీవోకే వ్యాఖ్యలపై ఎదురుదాడి

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణ విషయంతో మొదలైన వివాదం మహారాష్ట్రలో నిప్పులు రాజేస్తున్నది. సినీ తారలు, రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు కేసుల నమోదు చేసుకొంటున్నారు. ఓ వైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణను సీబీఐ, ఈడీ, ఎన్సీబీ చేపడుతుంటే.. మహారాష్ట్ర సర్కార్, ఇతర నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. తాజాగా కంగన రాజ్‌పుత్‌పై దేశద్రోహం కేసు పెట్టడంతో ఈ వివాదం మరింత రాజుకొన్నట్టు కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    ముంబై పోలీసుల తీరుపై

    ముంబై పోలీసుల తీరుపై


    లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం మనాలిలో ఉంటున్న కంగన రనౌత్ ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విచారణపై ముంబై పోలీసులు అనుసరిస్తున్న తీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఎంపీ సంజయ్ రౌత్, హోంమంత్రి ఆమెను హెచ్చరించారు. దాంతో ముంబై ఏమైనా పాక్ ఆక్రమిత కశ్మీరా అంటూ కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు.

    కంగనకు కేంద్ర వై సెక్యూరిటీ

    కంగనకు కేంద్ర వై సెక్యూరిటీ


    తనకు మహారాష్ట్ర పోలీసుల నుంచి ముప్పు ఉందనే అనుమానాలను వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం కంగనకు వై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. తనకు రక్షణ కల్పించడానికి అత్యుత్తమ భద్రతను అందించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. కంగన రనౌత్ 9వ తేదీన ముంబైకి రానున్న నేపథ్యంలో ఆమెపై శివసేన నేతలు దేశద్రోహం కేసును నమోదు చేశారు.

    థానేలో కంగనపై కేసు

    థానేలో కంగనపై కేసు

    శివసేన పార్టీకి చెందిన ఐటీ విభాగం మంగళవారం థానేలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చినందున ఆమెపై దేశద్రోహం కేసును నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముంబై ప్రజల మనోభావాలను కించపరిచినందున ఆమెపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    ఔరంగాబాద్‌లో కంగన రనౌత్‌పై దేశద్రోహం కేసు

    ఔరంగాబాద్‌లో కంగన రనౌత్‌పై దేశద్రోహం కేసు

    అలాగే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణంలో కూడా కంగన రనౌత్‌పై కేసు నమోదు చేశారు. ముంబై నగరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మహారాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీశారు. కావును ఆమెపై దేశద్రోహం కేసును నమోదు చేయాలని సీడ్కో పోలీస్‌ స్టేషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం ముంబై పర్యటన మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

    English summary
    Shiv Sena files sedition case against Kangana Ranaut in Thane, Aurangabad. As per ANI, Shiv Sena IT Cell files a complaint at Shrinagar Police Station in Thane against Kangana Ranaut seeking FIR against her under 'charges of sedition for her Pakistan occupied Kashmir (PoK) analogy for Mumbai'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X