Don't Miss!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
షాకింగ్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు.. ఇదీ అసలు విషయం
కొన్ని సందర్భాల్లో అస్సలు ఊహించని వార్తలు షాకిస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్, అది కూడా ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైందనే వార్త సంచలనంగా మారింది. పలు జాతీయ మీడియాలు ప్రచురించిన కథనాల ప్రకారం ఆమెపై కేసు ఫైల్ అయిందని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? వివరాల్లోకి పోతే..

యూత్ ఆడియన్స్‌కి మైకం తెప్పించిన ఆ భామనే '
అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు చిత్రసీమలో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరోయిన్ షాలినీ పాండేనే ఆ హీరోయిన్. విజయ్ దేవరకొండ జోడీగా ముద్దుల్లో మునిగిపోతూ యూత్ ఆడియన్స్‌కి మైకం తెప్పించిన ఈ భామపై క్రిమినల్ కేసు నమోదు కావడం అనే వార్త సంచలనం సృష్టిస్తోంది.

దర్శకనిర్మాతల కన్ను.. వివాదంలో చిక్కుకున్న షాలినీ
తొలి సినిమాతో తన నటనా ప్రతిభను చాటుకున్న షాలినీపై అన్నిభాషల దర్శకనిర్మాతలు కన్నేశారు. ఈ మేరకు ఆమెకు అన్నిభాషల నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో పాటుగా తమిళ, హిందీ భాషల్లోనూ ఆమెకు అవకాశాలు తలుపుతట్టాయి. ఈ నేపథ్యంలో ఓ సినిమా విషయమై ఆమె వివాదంలో చిక్కుకుందని అంటున్నారు.

కేవలం 27 రోజులు మాత్రమే..
విజయ్ ఆంటోనీకి జోడీగా షాలిని ‘అగ్ని సిరాగుగల్' అనే సినిమాలో నటించడానికి అంగీకరించిందట. మూడర్ కూడం నవీన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కేవలం 27 రోజులు మాత్రమే పాల్గొన్న షాలిని ఆ తర్వాత సెట్స్‌కు రావడం లేదట. మిగతా సన్నివేశాల్లో నటించనని ఆమె చెప్పిందట.

ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు.. క్రిమినల్ కేసు
అయితే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న శివ.. షాలిని కన్విన్స్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, పారితోషికం తీసుకుని సినిమాకు న్యాయం చేయలేదని తెలుగు, తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఆ నిర్మాత ఫిర్యాదు చేశారట. ఇంతటితో ఆగక షాలినిపై పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

కారణం అదే.. అందుకే!
ఇటీవలే బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా ‘జయేష్ భాయ్ జోర్దార్' అనే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది షాలినీ పాండే. బాలీవుడ్‌లో తొలి సినిమాలోనే సూపర్‌స్టార్ పక్కన నటించే అవకాశం రావడం కారణంగానే ఆమె ఇలా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని కోలీవుడ్ వర్గాల మాట. చూడాలి మరి ఈ వార్తలపై షాలిని స్పందన ఎలా ఉంటుందనేది.