SIIMA Awards 2025 winners list: సైమా అవార్డ్స్ 2025 విజేతలు వీరే.. పుష్పగాడిదే రూలింగ్!

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2025 అవార్డుల వేడుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు, అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. తొలి రోజున తెలుగు, కన్నడ చిత్రాలకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ప్రదానం చేశారు. 2024లో విడుదలైన సినిమాలకు గాను సైమా అవార్డులు అందించారు.

తెలుగు చిత్రాల విషయానికి వస్తే.. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణెలు నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచి అవార్డును దక్కించుకుంది. అలాగే ఉత్తమ విలన్, ఉత్తమ సహాయనటితో పాటు ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమాగా వైజయంతి మూవీస్ నిలిచాయి.

SIIMA Awards 2025 Here s the Complete list of winners

ఇక సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా ఈ అవార్డుల్లో తన హవా సాగించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్న, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డులు అందుకున్నారు. కమిటీ కుర్రాళ్లతో వెండితెరపై నిర్మాతగా అడుగుపెట్టిన మెగా డాటర్ నిహారిక కొణిదెలకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ అవార్డ్ దక్కింది. అవార్డ్ గ్రహీతలకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సైమా అవార్డ్స్ (తెలుగు)- 2025 విజేతలు వీరే

ఉత్తమ చిత్రం - కల్కి 2898 ఏడీ
ఉత్తమ దర్శకుడు - సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) - ప్రశాంత్ వర్మ (హనుమాన్)
ఉత్తమ నటి - రష్మిక మందన్నా (పుష్ప 2)
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2)
ఉత్తమ సహాయ నటుడు - అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ విలన్ - కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి - అన్నాబెన్ (కల్కి 2898 ఏడీ)
ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా - అశ్వినీదత్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్) - మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- తేజ సజ్జా (హనుమాన్)
బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ - భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ - నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ డెబ్యూ యాక్టర్ - సందీప్ సరోజ్
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - నంద కిశోర్ యేమాని
ఉత్తమ హాస్య నటుడు - సత్య (మత్తు వదలరా 2)
బెస్ట్ సినిమాటోగ్రఫీ - రత్నవేలు (దేవర)
ఉత్తమ గీత రచయిత - రామజోగ్య శాస్త్రి (చుట్టమల్లే - దేవర 2)
బెస్ట్ సింగర్ (ఫిమేల్)- శిల్పారావ్ (చుట్టమల్లే - దేవర 2)
బెస్ట్ సింగర్ (మేల్)- శంకర్ బాబు కందుకూరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X