Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పేదల కోసం 3వేల పాటలు పాడిన సింగర్ చిన్మయి.. ఆ డబ్బుతో వారికి సహాయం
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎలాంటి విషయంలో అయినా కుండ బద్దలు కొట్టి మాట్లాడుతుందనేది అందరికి తెలిసిన విషయమే. ఇక అప్పుడప్పుడు ఆమె కొన్ని మంచి పనులతో కూడా అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎన్నో పేద కుటుంబాల కోసం ఆమె చేసిన సహాయానికి అభిమానులు కూడా తొడయ్యారు.

82లక్షల రూపాయల విరాళాలు
ఈ రోజుల్లో చాలా తక్కువమంది సెలబ్రెటీలు మాత్రమే వారి టాలెంట్ ని కొన్ని మంచి పనుల కోసం ఉపయోగిస్తారు. ఇక చిన్మయి తన గాత్రంతో 82లక్షల రూపాయల విరాళాలు సేకరించింది. ఆ డబ్బును ఆమె పేద వారికోసం మాత్రమే ఉపయోగిస్తానని చెప్పింది. లాక్ డౌన్ వల్ల వేలాది కుటుంబాకు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.

డోనేషన్స్ కోసం విషెస్..
ఏప్రిల్ నెలలోనే సింగర్ చిన్మయి ఎలాగైనా తనవంతు సహాయం చేయాలని ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పుట్టినరోజున ప్రత్యేకంగా ఎవరికైనా విషెస్ తెలపాలి అనుకున్నా.. అలాగే ఏదైనా పాటను డెడికేట్ చేయాలని అనుకున్నా ముందుగా చారిటికి ఎంతో కొంత ఎమౌంట్ డొనేట్ చేయాలి.

3వేలకు పైగా పాటలు
డోనేషన్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ తనకు పంపిస్తే తప్పకుండా వారు కోరినట్లు విషెస్ అంధించడమే కాకుండా స్పెషల్ గా పాట కూడా పాడతానని చెప్పింది. అనుకున్నట్లుగానే చిన్మయికి భారీ స్థాయిలో మద్దతు లభించింది. ఇక ఆమె దాదాపు 3వేలకు పైగా పాటలు పాడి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక ఆ విషెస్ ద్వారా 82లక్షల రూపాయల విరాళాలను సేకరించారు.
Recommended Video

800 మంది కుటుంబాల కోసం
తమిళనాడులని 800 మంది కుటుంబాల ధీన పరిస్థితి గురించి తెలుసుకున్న చిన్మయి ముందుగా వారికి సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు కూలీలు కావడంతో లాక్ డౌన్ లో పూట గడవడమే కష్టంగా మారిందని, మరికొందరు అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలియగానే తన మనసు చలించిపోయిందని వివరణ ఇస్తూ.. అందుకే ఇలా డబ్బులు సంపాదించి వారికి సహాయం చేస్తున్నట్లు చిన్మయి తెలిపింది.