మళ్ళీ వార్తల్లోకి బిగ్ బాస్ మధుప్రియ.. వారి వేధిస్తున్నారని ఫిర్యాదు!

టాలీవుడ్ సింగర్ మధుప్రియ తాజాగా వార్తల్లోకి ఎక్కారు. చిన్న వయసులోనే ఆడపిల్లనమ్మా నేను ఆడ పిల్లనాని అనే ఒక జానపద గీతంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువ అయిన ఆమె ఆ తర్వాత టాలీవుడ్ లో సింగర్ గా అడపాదడపా అవకాశాలు అందుకుంటోంది. అయితే సింగర్ గా ఆమెకు లభించిన క్రేజ్ కంటే ప్రేమ పెళ్లి విషయంలో ఆమె ఎక్కువగా మీడియాలో ఫోకస్ అయింది..

ముందు తమ ప్రేమకు తల్లిదండ్రులు అడ్డంగా ఉన్నారని పోలీసులను ఆశ్రయించి హడావుడి చేసిన ఆమె ఆ తర్వాత తన భర్త తనను వేధిస్తున్నారని మళ్లీ అదే పోలీసులను ఆశ్రయించి అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. అయితే ప్రస్తుతానికి ఈ భామ మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళుతోంది. అయితే తాజాగా ఆమె హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పదేపదే బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని ఆమె శనివారం నాడు షీ టీం కు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.

singer madhu priya files complaint against blank calls

అయితే ఈ విషయం మీద షీటీమ్స్ స్పందిస్తూ ఫోన్ కాల్స్ అంటే సైబర్ సెల్ కి సంబంధించిన నేరాలు కావడంతో ఈ కేసును సైబర్ సెల్ కి ఫార్వర్డ్ చేసింది. దీంతో మధుప్రియను సైబర్ సెల్ కాంటాక్ట్ కాగా తనకు బ్లాంక్ వస్తున్న నెంబర్ల వివరాలు సైతం మధుప్రియ సైబర్ క్రైమ్ సెల్ పోలీసులకు అందించింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509, 354(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. గతంలో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ వన్ లో ఆమె కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X