twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam Pre Release Event: ఈ సినిమా మీ మైండ్ లో నుంచి మాత్రం వెళ్లిపోదు: హను రాఘవపూడి

    |

    దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం నిర్వహించారు. ఇక వేడుకకు ప్రభాస్ ప్రత్యెక అతిధిగా వచ్చారు. వేడుకలో చిత్ర దర్శకుడు హను రాఘవపూడి తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ప్రభాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాధారణంగా నేను ఈవెంట్లో మాట్లాడాలి అంటే భయపడుతూ ఉంటాను. కానీ ఈరోజు మాత్రం అలాంటిదేమీ లేదు. ఎందుకంటే సీతారామం సినిమా మీద నేను చాలా నమ్మకంగా ఉన్నాను. అదే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సినిమా మేకింగ్ విషయంలో నేను చాలా నేర్చుకున్నాను. ఒక విధంగా నాకు చాదస్తం ఎక్కువ అయినప్పటికీ కూడా ఈ చిత్ర నిర్మాతలతో నేను చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది.

    ఒక విధంగా ఈ సినిమా ఈ రోజు ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం నిర్మాత స్వప్న దత్ గారు. ఒక విధంగా నామీద నాకున్న నమ్మకం కంటే ఆమెకు ఉన్న నమ్మకమే ఎక్కువ. చివరగా నేను చేసిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో రామ పాత్ర కోసం నేను ఎవరిని సెలెక్ట్ చేద్దామా అని అనుకున్నప్పుడు మళ్లీ స్వప్న గారు నన్ను దుల్కర్ అయితే బెస్ట్ అని అన్నారు. నేను మొదట ఆ కథ అతనికి చెప్పినప్పుడు అతనికి ఏం అర్థమైందో కూడా నాకు అర్థం కాలేదు.

    దాదాపు నాలుగు గంటలు నేను తెలుగులో కథను చెప్పాను. ఎక్కువగా తెలుగులోనే మాట్లాడాను కానీ ఆయన అర్థం చేసుకుని సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. 2019లో అతనికి కథ చెప్పడం జరిగింది. సినిమా షూటింగ్ చేద్దామనుకునే లోపే కోవిడ్ మొదలయ్యింది. అప్పుడు నిరాశ పడకుండా కథను ఇంకా ఎక్కువగా డెవలప్ చేసుకోవడానికి సమయం ఉపయోగపడింది. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన మృనల్ ఠాగూర్ కూడా చాలా బాగా నటించారు. ఇక సుమంత్ గారిని అనుకున్నప్పుడు కొంత భయం అనిపించింది. కానీ ఆయన కథ చదివిన తర్వాత చాలా బాగా కనెక్ట్ అయ్యారు.

    Sita Ramam Pre Release Event Director Hanu raghavapudi speech

    రష్మికను ఈ సినిమాలో సెలెక్ట్ చేసుకోవడానికి ఒక కారణం ఉంది. ఆమె పాత్రను వెండితెరపై చూసిన తర్వాత అందరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా వారి ప్రాణం పెట్టి పనిచేశారు. మ్యూజిక్ కూడా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ముగిసిన తర్వాత కూడా ఆ పాత్రలు మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటాయి. థియేటర్లకు మళ్ళీ మళ్ళీ వచ్చి చూసేలా చేస్తాయి. ముఖ్యంగా ఇది ఒక అడిక్షన్ గా మారిపోతుంది. సినిమా థియేటర్లో నుంచి వెళ్లిపోయినా మీ మైండ్ లో నుంచి మాత్రం వెళ్ళిపోదు అని నమ్మకంగా చెప్పగలను అని హను రాఘవపూడి మాట్లాడారు.

    English summary
    Sita Ramam Pre Release Event Director Hanu raghavapudi speech
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X