Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కుండను తయారు చేస్తున్న సితార.. దానిపైనే శ్రద్ద పెట్టిందంటోన్న నమ్రత
లాక్ డౌన్ సమయాన్ని మహేష్ బాబు ఫ్యామిలీ తెగ సరదాగా గడుపుతోంది. రోజుకో వీడియోలు, ఫోటోలను పెడుతూ.. వారి ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటోంది నమత్ర. మహేష్ బాబు, గౌతమ్, సితార చేసే అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటోంది. మెమోరీ థెరపీ అంటూ ఈ లాక్‌డౌన్‌లో నమ్రత రోజుకో పాత విషయాన్ని గుర్తు చేస్తోంది. చిన్నతనంలో సితారా చేసిన అల్లరి, పాడిన పాటలు, చేసిన డ్యాన్సులు ఇలా నిత్యం ఏదో ఒక వీడియోను షేర్ చేస్తోంది.
సితార మహేష్ బాబు పాటలకు, సినిమాలకు మాత్రమే కాలు కదుపుతుంది. కేవలం మహేష్ బాబు పాటలను మాత్రమే పాడుతుంది. ఖాళీగా ఉన్నా, కార్లో ఎక్కడికైనా వెళ్తున్నా మహేష్ పాటలను హమ్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య నమ్రత షేర్ చేసిన క్యూట్ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఆగడు సినిమా షూటింగ్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన సితారా.. లొకేషన్‌లో వేసిన స్టెప్పులు, దానికి సంబంధించిన వీడియో ఓ రేంజ్‌లో హల్చల్ చేసింది.

తాజాగా సితారాను నవ్వించడానికి మహేష్ బాబు చిన్నపిల్లాడిలా మారిపోయాడు. ఈ మేరకు నమ్రత షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అయింది. రీసెంట్‌గా సితార తన చిన్ని చేతులతో కుండను తయారు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఇది రెండేళ్ల క్రితమే జరిగింది. ప్రస్తుతం నమ్రత ఈ వీడియోను పోస్ట్ చేయడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. వీడియోతో పాటు నమ్రత చేసిన కామెంట్ ఇంకా బాగుంది. 'కుండను తయారు చేయడంలో సితారా నిమగ్నమైంది.. మేమంతా తన చిన్ని చేతులు చేసే మ్యాజిక్ కోసం వెయిట్ చేస్తుంటే తాను మాత్రం మట్టి అంటిన తన చేతిని శుభ్రపర్చుకోవడంపైనే శ్రద్ద పెట్టింద'ని కామెంట్ చేసింది.