twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sonu Sood:మరో సంచలనం... శ‌బ్దం, వాస‌న‌, రుచి కోసం ఫ్రీ సర్జరీలు.. రియల్ హీరో కీలక ప్రకటన

    |

    సినిమాల్లో విలన్ రోల్స్ ఎక్కువగా చేసిన సోను సూద్ రియల్ లైఫ్ లో మాత్రం అందరికీ హీరోగా మారాడు. ఇండియాని కరోనా భయపెడుతున్న వేళ తానున్నానని అభయమిస్తూ ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తూ వెళ్లారు. అదీ ఇదీ అని కాకుండా ఎవరేం అడిగినా ఆయన చేస్తూ వెళ్లారు. తాజాగా ఆయన మీద ఐటీ రైడ్స్ కూడా జరిగాయి. ఇంకేముంది ఆయన కుంగిపోతాడు అని అనుకుంటే మరింత జోష్ తో సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    తమిళ సినిమాతో ఎంట్రీ

    తమిళ సినిమాతో ఎంట్రీ

    పంజాబ్ లో పుట్టిన సోనూసూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నా ఆయనకు బాలీవుడ్ అవకాశాలు దక్కడానికంటే ముందే తమిళ, తెలుగు భాషల్లో అవకాశాలు దక్కాయి. 1999లో విడుదలైన తమిళ సినిమాలో ఆయన ఒక పూజారి పాత్రతో సినీ తెరంగ్రేటం చేశాడు. తెలుగులో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో సోనూసూద్ ఒక చిన్న పాత్రలో నటించినా ఆ తర్వాత కూడా ఆయనకు సరైన అవకాశాలు మాత్రం దక్కలేదు.

    బిజీబిజీ

    బిజీబిజీ

    అయితే 2005లో నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమా ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. సూపర్ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకు రిలీజ్ అయిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవడంతో సోనూసూద్ కు నెగిటివ్ రోల్స్ రావడం మొదలయ్యాయి. అలా వరుస ప్రస్తుతం ఆయన తెలుగులో చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య అనే సినిమాలో విలన్ గా చేస్తున్నారు.

    మరో సేవతో ముందుకు

    మరో సేవతో ముందుకు

    అవసరమైన వారికి తన సేవలను అందించడంలో బిజీగా ఉన్న సోను సూద్ తాజాగా మరో అడుగు ముందుకేశారు. ఈ సారి ఏకంగా ఉచితంగా ఈఎన్‌టీ సర్జరీలను అందించనున్నానని ప్రకటించారు సోనూ. 'సోనూ ఛారిటీ ఫౌండేషన్‌' ద్వారా ఈ సేవలు అందించనున్నట్లు సోనూసూద్‌ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

    ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా

    ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా

    ఇక ఒక ఫోటో షేర్ చేసిన సోనూ 'ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇకపై.. వాసన, రుచి, శబ్దం చక్కగా ఆస్వాదిద్దాం' అనే క్యాప్షన్‌ ను కూడా రాశారు. ఇక ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా అందులో మెన్షన్ చేశారు సోనూ.

    ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే

    ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే

    ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలంటే ముందుగా www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో ఉచితంగా అందించే ఈఎన్‌టీ సర్జరీలకు సంబంధించి వివరాలు ఉంటాయి. ఆ తర్వాత రిజిస్టర్‌ ఆప్షన్‌ ప్రెస్ చేయాలి లేదా బార్‌ కోడ్‌ ను స్కాన్‌ చేయాలి. వెంటనే రిజిస్ట్రేషన్‌ ఫామ్ ఓపెన్‌ అవుతుంది. అక్కడ అన్ని వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. మీ వివరాలు సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ వారికి చేరి వారే మీకు కాల్ చేస్తారు.

    Recommended Video

    Athadu Ame Priyudu Movie Launch| Nagababu | Yandamuri Veerendranath | Kaushal | Filmibeat Telugu
     ఐటీ దాడులు

    ఐటీ దాడులు

    కొద్దిరోజుల క్రితం సోనూ ఇళ్లు, కార్యాలయాలపై ఏకంగా ఆరు చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు జ‌రిగాయి. దాదాపు రూ.20 కోట్లు ప‌న్ను క‌ట్ట‌కుండా త‌ప్పించుకున్నార‌ని ఐటీ అధికారులు వెల్లడించారు. మొత్తం 19 కోట్ల‌ రూపాయలు సేకరించి అందులో రెండు కోట్ల రూపాయ‌ల‌నే ఉప‌యోగించార‌ని, మిగ‌తా మొత్తాన్ని త‌న చారిటీ ఖాతాలోనే ఉంచుకున్నార‌ని కూడా అధికారులు వెల్లడించారు. అయితే తన మీద చేసిన ఆరోపణలను సోను సూద్ ఖండించారు.

    English summary
    Sonu Sood Announced Free Ent Surgeries By His Sood Charity Foundation to needed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X