For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వివాదంలో శ్రావణ భార్గవి.. శ్రీవారి పాటను శృంగార గీతంగా మార్చి సాంగ్.. తీవ్ర అవమానం అంటూ!

  |

  కొన్నాళ్ల క్రితం విడాకుల వార్తలు అనూహ్యంగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన శ్రావణ భార్గవి ఇప్పుడు అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. ఒక అన్నమయ్య కీర్తనను అందాన్ని అభివర్ణించడానికి వాడడంతో ఆయన కుటుంబ సభ్యులు సహా శ్రీవారి భక్తులు అలాగే టీటీడీ కూడా మండి పడుతున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  క్రేజ్ పెరిగింది

  క్రేజ్ పెరిగింది


  టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులో అనేక పాటలు పాడి మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత హేమచంద్రను ప్రేమించి వివాహం ఆడిన ఆమె కొన్నాళ్ల క్రితమే విడాకులు తీసుకోబోతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద నేరుగా క్లారిటీ ఇవ్వలేదు కానీ కొంచెం అటూ ఇటుగా ఈ వార్తల వల్ల తన క్రేజ్ పెరిగింది అని ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

  అందాన్ని అభివర్ణించుకునే

  అందాన్ని అభివర్ణించుకునే


  ఇప్పుడు తాజాగా ఆమె అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకుంది . అన్నమయ్యను శ్రావణ భార్గవి అవమానించారని ఆయన కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. తాజాగా శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తనతో కూడిన ఒక ఆల్బమ్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ఒకపరి వయ్యారమే అనే పాటను ఒక ఫ్యూజన్ గా షూట్ చేసిన ఆమె అందులో తన అందాన్ని అభివర్ణించుకునే విధంగా ఆమె చిత్రీకరించింది.

  తీవ్ర స్థాయిలో ఆగ్రహం

  తీవ్ర స్థాయిలో ఆగ్రహం


  ఇక ఈ విషయం అన్నమయ్య కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లడంతో అన్నమాచార్యుల పాటను వెకిలిగా చిత్రీకరించి ఆయనను అవమానించారు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట విడుదల చేసి రెండు రోజులు అవుతున్న నేపథ్యంలో అన్నమాచార్యులు అభిషేకం సమయంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ భక్తిపారవశ్యంతో మునిగి తేలిన అనుభూతి కోసం రాసిన పాటను శ్రావణ భార్గవి తన అందాన్ని వర్ణించడం కోసం వాడుకున్నారు అంటూ వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  కళ్ళల్లోనే ఏదో తేడా

  కళ్ళల్లోనే ఏదో తేడా


  అన్నమాచార్యులు పెద్ద కుమారులు పెద్ద తిరుమల ఆచార్యులు సాక్షాత్తు స్వామివారికి అభిషేక కైంకర్యం చేస్తూ కీర్తించిన పాటను ఆమె కాళ్ళు ఊపుతూ వివిధ భంగిమలలో చూపిస్తూ చిత్రీకరించడం చాలా బాధగా ఉందని ఆమె అందాన్ని వర్ణించుకోవడం కోసం అన్నమాచార్యుల కీర్తనను ఉపయోగించడం పొరపాటని అన్నమయ్య కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ విషయం గురించి ఆమెను మాట్లాడి ఆమె వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా మీ కళ్ళల్లోనే ఏదో తేడా ఉందని బాధ్యత రాహిత్యంగా సమాధానం ఇచ్చినట్లు అన్నమయ్య వంశస్థులు మీడియాకు తెలిపారు.

   ఎందుకు సాంగ్ చేయకూడదు

  ఎందుకు సాంగ్ చేయకూడదు


  సినీ పరిశ్రమకు చెందిన ఎవరైనా అన్నమాచర్ల కీర్తన తీసుకుంటే తిరు వెంకట చలపతి అనే ముద్రతో కీర్తన ముగిస్తారని కానీ శ్రావణ భార్గవి మాత్రం అలా చేయలేదని పేర్కొన్నారు. అది ఒక శృంగార కీర్తన అని మేము ఎందుకు సాంగ్ చేయకూడదు అని ఆమె ఎదురు ప్రశ్నిస్తోందని, చాలామంది ఆ పాటను తొలగించమని కోరడంతో అసలు ఆ పాట తొలగించకుండా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిందని తాళ్లపాక వెంకట రాఘవ అన్నమాచార్యులు మీడియాతో వాపోయారు. మరి ఈ విషయం ఎంత దూరం వెళ్లబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

  English summary
  sravana bhargavi on trouble with her new video using annamayya keerthana, annamayya family is angry with her response.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X