Just In
- 24 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ.. అయినా తప్పని ఓటమి!
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
కొంతమంది దర్శకులు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రికార్డులు క్రియేట్ చేయకపోయినప్పటికి సినిమా వర్గాల్లో మాత్రం మంచి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. సినిమాపై పరిజ్ఞానం ఉండేవారికి అలాంటి దర్శకులంటే చాలా ఇష్టం. ఇక అదే తరహాలో గత కొన్నేళ్లుగా క్రేజ్ అందుకుంటున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. చేసింది కొన్ని సినిమాలే అయినా శ్రీకాంత్ మంచి టాలెంటెడ్ అని ఇండస్ట్రీ ప్రముఖుల నమ్మకం.

రెండో అడుగులోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్
మొదట ఈ దర్శకుడు దిల్ రాజు ప్రొడక్షన్ లో కొత్త బంగారు లోకం సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను అందుకోవడంతో వెంటనే మరో బిగ్ ప్రాజెక్టును భుజాలపై వేసుకున్నాడు. ఏకంగా మహేష్ బాబు, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించాడు.

బిగ్గెస్ట్ డిజాస్టర్..
ఇక ఆ తరువాత మెగా హీరో వరుణ్ తేజ్ ను ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అప్పటివరకు బాగానే కొనసాగిన శ్రీకాంత్ అడ్డాల జర్నీ బ్రహ్మోత్సవం సినిమాతో ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

సురేష్ బాబు నమ్మకంతో..
బ్రహ్మోత్సవం తరువాత ఈ దర్శకుడు గ్యాప్ చాలా ఎక్కువగానే తీసుకున్నాడు. ఇక సురేష్ బాబు లాంటి అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ మళ్ళీ దర్శకుడిపై నమ్మకం ఉంచి నారప్పను రీమేక్ చేసే అవకాశాన్ని ఇచ్చాడు. వెంకటేష్ , ప్రియమణి జంటగా నటించిన ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కూచిపూడి వారి వీధిలో..
ఇక నెక్స్ట్ మరొక హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు శ్రీకాంత్. ఆర్ట్ డైరెక్టర్ గానే కాకుండా పలు సినిమాలను నిర్మించిన చంటి అడ్డాల కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని ఫిక్స్ ఆయినట్లు తెలుస్తోంది. కూచిపూడి వారి వీధిలో.. అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఆ సినిమాను GA2 ప్రొడక్షన్ లో బన్నీ వాసు నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.