నాకు బతుకు మీద ఆశ లేదు.. నా చావు దానికే, వాళ్ళు రక్తం కక్కుకు చావాలి .. శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే ఒక భూతం ఉందని చెబుతూ తాను ఆ భూతానికి బలయ్యానని రెండేళ్ల క్రితం మీడియా ముందుకు వచ్చిన శ్రీరెడ్డి దాదాపు అందరికీ పరిచయమే. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిని విమర్శిస్తూనే ఉండే ఈ భామ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

చెన్నైకు మకాం

చెన్నైకు మకాం


చెన్నైకు మకాం మార్చేసిన ఈ బ్యూటీ వీలు చిక్కినప్పుడల్లా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. చెన్నైలో ఉంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ అక్కడే నివాసం ఉంటోంది. అయినా సరే అప్పుడప్పుడూ కొందరిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ గురించి ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద పోస్టులు పెడుతూనే ఉంటుంది.

నిరాశాజనకమైన జీవితం

నిరాశాజనకమైన జీవితం

తాజాగా ఫేస్బుక్ వేదికగా ఆమె పోస్ట్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. అయితే తనకు ఎవరూ విష్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆమె తన జీవితం ఒక నిరాశాజనకమైన జీవితం అని చెప్పుకొచ్చింది.

 సింగిల్ లైఫ్

సింగిల్ లైఫ్

తనది సింగిల్ లైఫ్ అని పేర్కొన్న శ్రీ రెడ్డి తన చావు కూడా ఒక మంచి కారణం కోసమే జరగాలని కోరుకుంది. అలాగే మీరు అంతా ఆనందంగా ఉండాలని, అందరికీ దేవుడు దీవెనలు పొందాలని ఆమె పోస్ట్ లో పేర్కొంది. అలాగే జై కాళీ అని పేర్కొన్న ఆమె అందరికీ లవ్ యు అని కామెంట్ చేసింది.

రక్తం కక్కుకు చావాలి

రక్తం కక్కుకు చావాలి

ఇక రైతులు వర్ధిల్లాలి అని కోరిన ఆమె ఆడపిల్లలను రేప్ చేసి చంపకూడదని కోరింది. పిల్లలు, పెద్ద చదువులు చదువుకోవాలని, వైసీపీ ప్రభుత్వం ఆంధ్రాని అభివృద్ధి చేయాలని కోరింది. వైఎస్ఆర్, వైయస్ రాజా రెడ్డిని చంపిన వాళ్ళు రక్తం కక్కుకు చావాలి ఇవే నా కోరికలు అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.

నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్

నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్

ఇక అక్కడితో ఆగని ఈ భామ గతంలో పవన్ కళ్యాణ్ కి తనకి పెళ్లి అవుతున్నట్టు, ఆ పెళ్ళికి పెద్దగా రామ్ గోపాల్ వర్మ వ్యవహరిస్తున్నట్లుగా మార్ఫ్ చేసిన ఒక ఫోటో షేర్ చేసి ''సార్ సజ్జనార్ గారు ఇలాంటి ఎడిటింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించండి సార్ ఇలాంటి ఫొటోస్ బయటకు వస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్'' అంటూ కామెంట్ చేయడం పవన్ ఫాన్స్ కి కోపం తెప్పిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X