వాడు మహాత్ముడా? జాతిపితనా? గాంధీజీపై శ్రీకాంత్ అయ్యంగార్ బుతుపురాణం
తెలుగు సినిమా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ మరోసారి అత్యంత దారుణంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి ఆయన చేసింది సినీ ప్రముఖుడో లేదా? రాజకీయ నాయకుడు అనుకొంటే పొరపాటు. ఏకంగా దేశం మొత్తం మహాత్ముడిగా కొలిచే గాంధీజీని నోటితో పలుకలేని విధంగా దూషించాడు. ఆయన మహత్ముడా? జాతిపితనా? అంటూ బూతులు పురాణం అందుకొన్నాడు. ఆయన తన వీడియోలో ఏం దూషించారంటే?
అక్టోబర్ 2వ తేదీన గాంధీజీ జన్మదినం సందర్భంగా శ్రీకాంత్ భరత్ ఓ వీడియో పోస్టు చేసి దారుణంగా బూతులు తిట్టారు. ఆ వీడియోపై కొందరు కామెంట్ చేసి ట్రోల్ చేస్తే.. మరో వీడియోను షేర్ చేశాడు. గాంథీజీని జాతిపిత అని చెప్పడానికి అవమానకరం. ఆయన స్త్రీలోలుడు అంటూ కామెంట్ చేశాడు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కొందరు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నమస్కారం. నేను శ్రీకాంత్ భరత్. నేను ఏ పోస్టు పెట్టినా కామెంట్స్ బాగా వస్తున్నాయి. అయినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ అక్టోబర్ 2వ తేదీన పెట్టిన ఓ పోస్టు పెడితే.. చాలా బూతులు తిట్టారు. కొందరు బాగా చెప్పావు అంటూ కామెంట్ చేశారు. నేను కామెంట్ చేసిన వ్యక్తి గురించి మీకు ఏం తెలుసురా? అంటూ శ్రీకాంత్ భరత్ రెచ్చిపోయారు.
15, 16 ఏళ్ల అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి.. తన నిగ్రహాన్ని పరీక్షించుకొన్నాడు. ఎంతో మంది అమ్మాయిలను వేధించాడు. వాడు మహాత్ముడా? వాడు XX ఆత్ముడు. వాడు స్వాతంత్ర్యం తీసుకు రావడం ఏమిటి? బొక్కా!సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి లక్షల మంది తెచ్చారు. వాళ్లు పరమాత్ములు. వీడు ప్యూడో ఫైల్ అంటూ బూతులతో శ్రీకాంత్ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
అయితే మహాత్మగాంధీని ఉద్దేశించి.. వాడు జాతిపితనా? భరతమాత అనే వ్యక్తులం మేము. జాతిపితనా? జాతిపితనా? నేను సింపుల్‌గా స్టేట్‌మెంట్ ఇస్తాను. ఒకవేళ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ అయితే.. నేను సిటిజన్ ఆఫ్ బాస్టర్డ్. జై హింద్.. ఇడియట్స్.. మీరు ఇంకా నేర్చుకొండి అంటూ శ్రీకాంత్ అయ్యాంగర్ అన్నాడు.
అయితే శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. గతంలో కూడా సినిమా రివ్యూవర్స్‌పై, ఇతర సినీ ప్రముఖులపై బూతులతో కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత పరిస్థితి చేజారిపోవడంతో ఆయన వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో ఆయనపై గాంధేయవాదులు భగ్గుమంటున్నారు.


Click it and Unblock the Notifications











