For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంతకాలు ఫోర్జరీ చేశాను.. స్టార్ హీరో ఫోన్ చేస్తే నీ పేరేంటని అడిగా: శ్రీనివాస్ అవసరాల

  |

  అష్టా చమ్మా సినిమాతో వెండితెరకు పరిచయమైన శ్రీనివాస్ అవసరాల ఆ తర్వాత దర్శకుడిగా రైటర్ గా టెలివిజన్ ప్రజెంటర్ గా కూడా వర్క్ చేశాడు. రెండు నంది అవార్డులను ఒక సైమా అవార్డు కూడా సొంతం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఒకవైపు నటుడిగానే కాకుండా మరొక వైపు దర్శకుడిగా కూడా అడుగులు వేస్తున్న శ్రీనివాస్ అవసరాల నూటొక్క జిల్లాల అందగాడు అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బట్టతల నేపథ్యంలో రాబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ కథను అతనే సొంతంగా రాసుకున్నాడు.

  క్రియేటివ్ దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇటీవల ఆలీతో సరదాగా అనే టాక్ షోకు ప్రత్యేకమైన గెస్ట్ గా వెళ్లిన శ్రీనివాస్ తన పర్సనల్ విషయాలను చాలానే బయటపెట్టాడు. ముఖ్యంగా మొదటి సినిమా తర్వాత రవితేజ నుంచి ఫోన్ కాల్ కూడా వచ్చిందట. కానీ శ్రీనివాస్ మాత్రం రవితేజకు ఇచ్చిన సమాధానం అతన్ని ఆశ్చర్యాన్ని కలుగజేసిందట. అలాగే గతంలో కొన్ని సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్లు శ్రీనివాస్ అలీ తో చెప్పాడు.

  Avinash Engagement: అవినాష్ పెళ్లాడే అమ్మాయి ఎవరంటే.. పర్సనల్ ఫొటోల్లో ఎలా ఉందో చూడండి!

  అష్టాచమ్మా ఆడిషన్స్ కు వెళ్లగానే..

  అష్టాచమ్మా ఆడిషన్స్ కు వెళ్లగానే..

  శ్రీనివాస్ అవసరాల అనగానే ఒక డిఫరెంట్ టైమింగ్ ఉండే ఒక కామెడీయన్ గానే ఎక్కువమంది గుర్తు పడతాడు. కానీ అతనీలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ కూడా ఉందని పిల్ల జమిందార్, కంచె సినిమాలతో ఋజువైంది. శ్రీనివాస్ మొదట నటుడిగా సెట్ అవ్వాలని అనుకోలేదట. అయితే అమెరికాలో ఉన్నత చదువులు చదివి మంచి జాబ్ లో కూడా వదిలేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు ఏమీ చేయలేదట. అష్టాచమ్మా ఆడిషన్స్ కు వెళ్లగానే అందులో ఆనంద్ అనే పాత్రకు సెలెక్ట్ అయ్యాడట.

  కమెడియన్ , లీడ్ రోల్స్..

  కమెడియన్ , లీడ్ రోల్స్..

  ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన అనంతరం దర్శకుడుగా వర్క్ చేయాలని అనుకున్నప్పుడు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించాడు. నటుడిగా ఎలాంటి సినిమా చేసినా కూడా శ్రీనివాస్ అవసరాలకు మంచి గుర్తింపు లభించింది. సరదాగా కాసేపు, పిల్లజమీందార్, అరవింద్ 2, అడ్డా వంటి డిఫరెంట్ సినిమాల్లో ఒక మంచి కమెడియన్ గా కనిపించే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సినిమాల్లో లీడ్ రోల్స్ లో కూడా నటించాడు. వరప్రసాద్ పొట్టి ప్రసాద్, ముగ్గురు, ఊహలు గుసగుసలాడే, బాబు బాగా బిజీ వంటి సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించాడు.

  ఇంట్లో వాళ్ళకు తెలియకుండా

  ఇంట్లో వాళ్ళకు తెలియకుండా

  ఒక వైపు కమెడియన్ గా మరోవైపు లీడ్ యాక్టర్ గా దర్శకుడిగా రచయితగా కొనసాగుతున్న శ్రీనివాస్ అవసరాల కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రీ లో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. సినిమా అంటే తనకు ఎంతో ఇష్టం. ఇంట్లో వాళ్లకు చెప్పకుండానే మొదటి సినిమా ఆడిషన్స్ కి వెళ్లాను. అష్టాచమ్మా రిలీజ్ అయ్యే వరకు కూడా మా వాళ్లకు సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియదు. నా మొదటి సినిమా చూసిన తర్వాత నా తల్లిదండ్రులు మరోసారి సినిమా చేయవద్దని కూడా ఉన్నారు. అప్పుడు కాస్త కంగారు పడ్డాను అని సమాధానం ఇచ్చాడు

  అప్పుడు కాస్త నమ్మకం వచ్చింది

  అప్పుడు కాస్త నమ్మకం వచ్చింది

  ఎప్పుడైతే ఊహలు గుసగుసలాడే సినిమా డైరెక్ట్ చేసి అందులో నటించానో అప్పుడు నా తల్లి దండ్రులకు కాస్త పనికి వస్తాను అని నమ్మకం వచ్చింది. ఎక్కువగా నా మొహం మీద అయితే అనలేదు కానీ పర్వాలేదు అని వెనకాల కారులో కూర్చున్నప్పుడు చెప్పారు. ఆ తర్వాత కాస్త ధైర్యం కూడా వచ్చిందని తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లాలి అనుకున్నట్లు శ్రీనివాస్ వివరణ ఇచ్చాడు.

  రవితేజ ఫోన్ చేస్తే..

  రవితేజ ఫోన్ చేస్తే..

  అష్టాచమ్మా సినిమా విడుదల అనంతరం ఒక పెద్ద హీరో సినిమా చూసి ఫోన్ చేస్తే కొంత సేపటి వరకు ఆ సంభాషణ అలానే జరిగింది. సినిమా గురించి అనేక రకాల విషయాలు కూడా మాట్లాడారు. నేను కూడా వినయంగా సమాధానం చెప్పాను. అయితే చివరికి ఫోన్ పెట్టే సమయంలో కూడా నేను ఆయన్ను గుర్తు పట్టలేదు.అంతా మాట్లాడిన తర్వాత చివరికి నీ పేరు ఏమిటి అని అడగగానే.. తనను రవితేజ అని అంటారని ఆయన సమాధానం ఇచ్చారు.

  ఫోర్జరీ సంతకాలు

  ఫోర్జరీ సంతకాలు

  రవితేజ అనగానే కొంతసేపు నేను షాక్ అయ్యాను అని శ్రీనివాస్ తెలియజేశాడు. అలీ కూడా శ్రీనివాస్ మాటలకు తనదైన శైలిలో పంచులు వేశాడు ఎవరితో అయినా మొదట ఫోన్లో మాట్లాడే ముందు మీ పేరు తప్పకుండా చెప్పాలని అందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పాడు. నువ్వు ఫోర్జరీ సంతకాలను చాలా బాగా పెడతావాని విన్నాను అది నిజమేనా? అని అలీ మరో పదునైన ప్రశ్నను అడిగాడు. అందుకు శ్రీనివాస్ అదంతా ఒకప్పుడు మాత్రమే అని చెప్పాడు.

  House Arrest Movie Team Funny Chit Chat With Roll Rida
  కావాలనే ఆ కాంట్రవర్సీ వీడియో

  కావాలనే ఆ కాంట్రవర్సీ వీడియో

  ఒకసారి ఫోర్జరీ చేసిన దొరికిన తరువాత మళ్ళీ అలంటి పనులు చేయలేదని అన్నాడు. ఒక అయిదారుగురు ముఖ్యమైన సంతకాలు ఫోర్జరీ చేసినట్లు చెప్పాడు. ఇక నూటొక్క జిల్లాల అందగాడు సినిమా కోసం ఆమధ్య ఒక కాంట్రవర్సీ వీడియోను విడుదల చేసిన విషయంపై అలీ ప్రశ్నలు వేశారు. అయితే సినిమా కోసం కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే నాకు అంతగా నచ్చదు అని అనిపించింది. కానీ ఆ సినిమా కంటేట్ కోసం ఇలాంటి వీడియోలు ఈ సినిమాకు తప్పకుండా అవసరం అని అనుకున్నాను. అందుకే ఆ విధంగా వీడియో చేయాల్సి వచ్చిందని శ్రీనివాస్ అవసరాల వివరణ ఇచ్చాడు.

  English summary
  Srinivas avasrala about ravi teja phone call for first movie appreciation
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X