OG Celebrities Review: ఓజీకి సెలబ్రెటీల రివ్యూ.. పవన్ కళ్యాణ్ రేంజ్ అదే అంటూ..
సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025లో టాలీవుడ్ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సినిమా కావడంతో ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు వారం ముందు నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఓజీ మేనియా చోటు చేసుకుంది. ఇక ఒకరోజు ముందే సెప్టెంబర్ 24 రాత్రి ప్రీమియర్స్, స్పెషల్ షోలతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇక ఓజీ రిలీజ్ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఓజీ బడ్జెట్ ఎంత?
ఓజీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

గుర్తు పెట్టుకోండి ఇది ఆరంభం మాత్రమే.. అన్ని సెట్ అయితే ఓజీ ప్రపంచం మరింత పెద్దది అవుతుంది. లవ్ యూ మై పవర్ స్టార్ అని ఓజీ దర్శకుడు సుజీత్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఆయన సినిమాస్ నియర్ యూ అని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేశారా అంటూ పవన్ అభిమానులు డిస్కస్ చేస్తున్నారు.
OG అనేది అసలైన జెయింట్ బ్లాక్‌బస్టర్. ఎవరూ మీకు వేరే సినిమాను చెప్పనివ్వకండి అని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు.
నిన్న రాత్రి ఓజీ ప్రీమియర్ షోని ఎంజాయ్ చేశా.. సూపర్ స్టైలీష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్, మ్యూజిక్, గూస్ బంప్ హై సీన్స్‌తో సక్సెస్ కొట్టినందుకు దర్శకుడు సుజీత్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ఓజీ టీమ్‌కి అభినందనలు అని హీరో నిఖిల్ ట్వీట్ చేశారు.
అభిమానులకు ఫీస్ట్, ఓజీ సినిమా దసరా సీజన్‌లో దీపావళి. పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన ప్రజెన్స్, ఛరిష్మాటిక్ ఆరా, సుజిత్ మేకింగ్, థమన్ మ్యూజిక్ అన్ని కలిపి ఓజీని బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. థియేటర్‌లో పవర్‌స్టార్ పూనకాలతో యాక్షన్ బ్లాక్‌లు చూసి ఆనందించండి అని నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు (ఎస్కేఎన్) ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











