Don't Miss!
- Finance
Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి..!
- News
YS విజయమ్మతో భేటీ అయిన అవినాష్ రెడ్డి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
MICHAEL: సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ ప్రకటన: విజయ్ సేతుపతి రోల్ అదే
అద్భుతమైన టాలెంట్ ఉన్నా.. హిట్లు దొరకక ఇబ్బందులు పడుతున్న హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడమో.. మరో కారణమో తెలియదు కానీ.. వాళ్లు ఎన్ని సినిమాలు చేసినా సరైన ఫలితాన్ని అందుకోవడం లేదు. అలాంటి వారిలో యంగ్ హీరో సందీప్ కిషన్ ఒకడు. హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్న కేవలం మూడు నాలుగు హిట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా సక్సెస్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస పెట్టి ఎన్నో సినిమాలను చేస్తూ ముందుకెళ్తున్నాడు.
కాలేజ్ టైమ్‌లో అలాంటి పనులు.. ఆ ఉద్దేశం లేకపోయినా: నిరుపమ్ భార్య మంజుల షాకింగ్ కామెంట్స్
ఇప్పటికే పలు చిత్రాలతో తన టాలెంట్‌ను తెలుగు చిత్ర సీమకు పరిచయం చేసిన సందీప్ కిషన్.. తమిళంలోనూ పలు మూవీల్లో నటించాడు. ఈ క్రమంలోనే అక్కడ కూడా సుపరిచితుడు అయ్యాడు. దీంతో అతడికి రెండు పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సందీప్ కిషన్ ఇప్పుడు ఏకంగా ఓ పాన్ ఇండియా సినిమాలోనే నటిస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో ఈ యంగ్ హీరోతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు.

సందీప్ కిషన్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. రంజిత్ జయకోడి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'మైఖేల్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్‌లో దెబ్బలు తిని ఉన్న రెండు చేతులు కనిపిస్తున్నాయి. అందులో ఓ దానికి సంకెళ్లు ఉండగా.. మరో చేతిలో ఆయుధం ఉంది. దీంతో ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో విజయ్ సేతుపతి స్పెషల్ యాక్షన్ పాత్రలో నటిస్తున్నట్లు కూడా ఈ పోస్టర్‌లో ప్రత్యేకంగా ప్రకటించారు. తద్వారా ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెంచేశారు.
అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మైఖేల్' మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులు, పని చేసే టెక్నీషియన్ల వివరాలను అతి త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికి సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమా చేస్తుండడంతో.. అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే, ఇందులో విజయ్ సేతుపతి ఉండడం ఈ ప్రాజెక్టుకు ప్రధాన బలం అని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. సందీప్ కిషన్ ఇప్పటికే జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో 'గల్లీ రౌడీ' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించినా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. దీంతో సందీప్ కిషన్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా అతడు 'మైఖేల్' వంటి పాన్ ఇండియా ప్రాజెక్టును ప్రకటించడంతో వాళ్లంతా సంతోషిస్తున్నారు.